ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతోన్న జస్‌ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఒక ఓవర్‌లో 35 (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) పరుగులు చేసి, టెస్టుల్లో ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పుడు వికెట్ల పరంగా మరో ఘనత సాధించాడు.
ఇప్పటివరకూ 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రాకి ముందు భువనేశ్వర్ కుమార్ అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉండేవాడు. 2014 సిరీస్‌లో అతడు 19 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఆ రికార్డ్‌ని బుమ్రా తిరగరాశాడు. ఇక బుమ్రా, భువి తర్వాతి స్థానాల్లో జహీర్ ఖాన్ (2007లో 18 వికెట్లు), ఇషాంత్ శర్మ (2018లో 18 వికెట్లు), సుభాశ్ గుప్తే (1959లో 17 వికెట్లు) ఉన్నారు.
కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదో స్థానంలో బరిలోకి దిగి బ్యాట్‌తో (16 బంతుల్లో 31) చెలరేగిన బుమ్రా.. ఆ తర్వాత బంతితోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ టాప్ 3 బ్యాట్స్మన్లు ముచ్చెమటలు పట్టించి, పెవిలియన్ పంపించాడు. అటు.. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో డైవిండ్ క్యాచ్ పట్టుకొని, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.