NTV Telugu Site icon

Rohit Sharma: మా కెప్టెన్ అందుకే పరుగులు చేయట్లేదు.. ఇషాన్ సెటైరికల్ జవాబు

Ishan On Rohit Form

Ishan On Rohit Form

Ishan Kishan Satirical Comments On Rohit Sharma Form In IPL: ఈ ఐపీఎల్ సీజన్‌తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడో అందరికీ తెలుసు. ఒక్క అర్థశతకం మినహాయించి.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అతడు ఆడలేదు. దీనికితోడు.. గత ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్స్‌కే పరిమితమై, ఆ చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ఫామ్‌పై ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. అసలు రోహిత్‌కి ఏమైంది? పరుగుల సునామీ సృష్టించే ఆటగాడు ఎందుకిలా ఆడుతున్నాడు? అని క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి మాజీలైతే.. తనే గనుక కెప్టెన్ అయ్యుంటే, రోహిత్ జట్టులోకే తీసుకునేవాడ్ని కాదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.

Bou Samnang: శభాష్ సామ్నాంగ్.. ఆటలో ఓడినా ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది

ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన కెప్టెన్ ఫామ్‌పై సెటైరికల్‌గా వ్యాఖ్యానించాడు. హర్భజన్ సింగ్, సునీల్ గవాస్కర్‌లో జరిగిన సంభాషణలో.. బహుశా ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచి ఉంచాడేమోనంటూ ఇషాన్ పేర్కొన్నాడు. ‘‘ఫామ్‌లో లేని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలా ఉంటున్నాడు? అతని ఆలోచనలు ఏంటి? అని ఆ ఇద్దరు ఇషాన్‌ని ప్రశ్నించారు. అందుకు ఇషాన్ కిషన్ బదులిస్తూ.. ‘‘తన ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ కంగారేమీ పడట్లేదు. ప్రాక్టీస్ సెషన్‌లో తన ప్రాసెస్‌పై ఆయన పూర్తి దృష్టి పెడుతున్నాడు. అయితే.. ఈ సీజన్‌లో రోహిత్ సహా ఇతర పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇబ్బంది పడటాన్ని మనం చూస్తున్నాం. నాకు తెలిసి.. ప్లేఆఫ్స్‌లో పరుగుల వర్షం కురిపించడం కోసం.. ఆయన ఇప్పుడు పరుగుల్ని దాచి పెట్టుకుంటున్నాడని అనిపిస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

ఇషాన్ ఆ మాట చెప్పినప్పుడు.. గవాస్కర్‌, హర్బజన్‌లు ఒక్కసారిగా నవ్వేశారు. అంతేకాదు.. ‘‘నిజమే, వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం కూడా పరుగులు దాచి పెడుతున్నాడేమో’’ అని గవాస్కర్ మరో కౌంటర్ వేశాడు. అప్పుడు ఇషాన్ వెంటనే అందుకొని.. ‘‘అవును అది కూడా కరెక్టే’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. ఇదంతా వాళ్లు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సంభాషణను రోహిత్ శర్మ అభిమానులు సైతం సరదాగానే తీసుకున్నారు.