NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడటం పక్కా!

Rohit Sharma

Rohit Sharma

Wasim Akram Wants Rohit Sharma To Play KKR in IPL 2025: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 ఓటములతో అధికారికంగా ఎలిమినేట్‌ అయింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్‌ పాండ్యాకు బాధ్యతలు అప్పగించినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ సీజన్‌లో కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతున్న రోహిత్.. పరుగులు చేస్తున్నా భారీ స్కోర్లు మాత్రం చేయడం లేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ముంబై జట్టుకు హిట్‌మ్యాన్ ఆడే అవకాశాలు చాలా తక్కువని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీమ్‌ అక్రమ్‌ స్పందించాడు.

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ ఆడే అవకాశాలు చాలా తక్కువ అని వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. స్పోర్ట్స్‌ కీడాతో వసీమ్‌ అక్రమ్‌ మాట్లాడుతూ… ‘నా మనసులో ఒకటి మెదులుతోంది. రోహిత్ శర్మ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో ఉండడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చూడాలని నాకు ఉంది. ఓపెనర్‌గా రోహిత్.. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్, మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్.. ఇలా ఊహించుకుంటేనే చాలా బాగుంది. కోల్‌కతా బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ను కలిగి ఉంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో రోహిత్ బాగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు ఆటగాడు అనడంలో సందేహం లేదు. అందుకే కోల్‌కతా తరఫున రోహిత్‌ను చూడాలని ఉంది’ అని అన్నాడు.

Also Read: Hardik Pandya: తిలక్‌ వర్మపై హార్దిక్ పాండ్యా నిందలు.. ఇద్దరి మధ్య వాగ్వాదం!

ఐపీఎల్ 2025లో కేకేఆర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోందని వసీమ్‌ అక్రమ్‌ ప్రశంసించాడు. ‘ఈ సీజన్‌లో కేకేఆర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వచ్చిన తర్వాత ఆట మెరుగైంది. మైదానంలో బయట కూర్చుని ఆటగాళ్లతో గౌతీ నిత్యం మాట్లాడతాడు. అయితే ఒక్కసారి మ్యాచ్ ఆరంభం అయితే.. కెప్టెన్‌కే అన్నీ వదిలేస్తాడు. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్ జట్టును సరైన దారిలో నడపిస్తున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ వివిధ స్థానాల్లో వస్తూ పరుగులు చేస్తున్నాడు. జట్టు గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి గౌతమ్‌ ఉన్నాడనే భరోసా శ్రేయస్‌కు ఉంది’ అని అక్రమ్‌ చెప్పుకొచ్చాడు.