వైభవ్ సూర్యవంశీ… గత నెల రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. 14 ఏళ్లకే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ కుర్రాడు తొలి మ్యాచ్ లోనే 34 పరుగలతో ఆశ్చర్యపరిచాడు. రెండో మ్యాచ్ లో స్వల్ప స్కోరుకే అవుటైనప్పటికీ తాజాగా గుజరాత్ పై చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఇషాంత్ శర్మ, సిరాజ్ లాంటి సీనియర్ బౌలర్లను ఎదుర్కొంటు పరుగుల వరద పారించాడు. 17 బంతులకే హాఫ్ సెంచరీ చేసి,, 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. 265 స్ట్రైక్ రేట్ తో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు.
వైభవ్ రాజస్థాన్ తరుపున ఆడుతున్నా… అతను మాత్రం ధోనీకి వీరాభిమాని. 8 ఏళ్ళ వయసులో ధోనీ బ్యాటింగ్ చూసేందుకు మైదానానికి వెళ్ళేవాడు. 2017 లో ధోనీ, పూణే సూపర్ జయింట్స్ తరుపున ఆడాడు. అయితే ధోనీకి వీరాభిమాని అయిన వైభవ్ గ్రౌండ్ కి తీసుకెళ్లాలని తన తండ్రి సంజీవ్ ని రిక్వెస్ట్ చేయడంతో.. ధోని కోసం వైభవ్ ని మైదానానికి తీసుకెళ్లాడు. ధోనీ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే ధోనీని చూసి తెగ సంతోసించేవాడు. 8 ఏళ్ళ వయసులో పూణే జెర్సీతో వైభవ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అప్పుడు తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ధోనీ అట చూస్తూ పెరిగిన వైభవ్ ఎప్పటికైనా ధోనీలా ఆడాలనుకున్నాడు. తన కెరీర్ ఇదే అని అప్పుడే ఫిక్స్ అయ్యాడు. అలా రోజుకు 600 బంతులు ప్రాక్టీస్ చేసేవాడు. వేలంలో రాజస్థాన్ వైభవ్ ని 1.1 కోట్లకు కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ తన పొటన్షియల్ ఏంటో తొలి మ్యాచ్ లోనే చూపించాడు.
