Site icon NTV Telugu

SRH vs CSK: భారీ స్కోరు చేసిన చెన్నై.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే..?

Csk

Csk

ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. 213 పరుగుల భారీ టార్గెట్ ను ముందుంచింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లు హైదరాబాద్ బౌలర్లకు ఊచకోత చూపించారు. సిక్సులు, ఫోర్లతోనే డీల్ చేశారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. అతనికి తోడు శివం దూబే (39*) పరుగులతో చెలరేగాడు.

Read Also: AP Weather: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

చెన్నై బ్యాటింగ్ లో అజింక్యా రహానే (9) పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత గైక్వాడ్ (98), మిచెల్ (52) పరుగులతో అదరగొట్టారు. రుతురాజ్, డారిల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండో వికెట్‌కు 107 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గైక్వాడ్ ఈ సీజన్‌లో తన మూడో అర్ధ సెంచరీని సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శివం దూబే (39) బౌలర్లపై దండయాత్ర చేశారు. చివర్లో ధోనీ (5) పరుగులు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. కమిన్స్, షాబాజ్ అహ్మద్ వికెట్ సాధించలేకపోయారు.

Read Also: KCR: 3 నెలల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version