Site icon NTV Telugu

SRH vs KKR: కేకేఆర్‌పై సన్‌రైజర్స్ ఘనవిజయం.. బాగానే పోరాడారు కానీ..

Sunrisers Won Match

Sunrisers Won Match

Sunrisers Hyderabad Won The Match Against KKR: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా ఛేధించలేకపోయింది. 205 పరుగులకే చాపచుట్టేయడంతో.. 23 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపొందింది. సన్‌రైజర్స్‌కి ఇది ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయం. దీంతో.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. టాప్-4లో హైదరాబాద్ జట్టు స్థానం సంపాదించుకోవాలంటే.. రన్ రేట్ మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.

Ashu Reddy: అషూ.. క్యాజువల్ డ్రెస్ లో కూడా కాక పుట్టిస్తోందిగా

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 100) శతక్కొట్టడంతో పాటు కెప్టెన్ మార్ర్కమ్ (26 బంతుల్లో 50) అర్థశతకంతో చెలరేగడంతో.. సన్‌రైజర్స్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. అభిషేక్ శర్మ (32) , హెన్రిచ్ (16) సైతం జట్టుకి భారీ స్కోరు అందించడంలో తమవంతు సహకారం అందించారు. ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు.. ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తొలుత కేకేఆర్ వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో.. ఆ జట్టు కనీస పోరాట పటిమ కనబరుస్తుందా? అనే అనుమానాలు రేకెత్తాయి. అప్పుడు జగదీశన్‌తో కలిసి నితీశ్ రానా పరుగుల వర్షం కురిపించడంతో.. ఛేజింగ్‌పై ఆసక్తి రేకెత్తింది. జగదీశన్ ఔటైనా కాసేపటికే రసెల్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో.. కేకేఆర్ కాస్త నెమ్మదించింది.

Etela Rajender : తెలంగాణ ప్రజలు కేసీఆర్‌పై విసుగు చెంది బీజేపీ వైపు చూస్తున్నారు

కానీ.. ఎప్పుడైతే రింకూ సింగ్ క్రీజులోకి దిగాడో, అప్పటినుంచి బాదుడే బాదుడు కార్యక్రమం మొదలైంది. ఒకవైపు నితీశ్, మరోవైపు రింకూ.. ఎడాపెడా షాట్లతో బౌండరీల వర్షం కురిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. వీళ్లిద్దరు కొట్టిన కొట్టుడు చూసి.. లక్ష్యాన్ని ఛేధిస్తారేమో? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ.. నితీశ్ వికెట్ పడ్డాక మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటిదాకా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు.. కాస్త కట్టుదిట్టడం బౌలింగ్ వేయడంతో మ్యాచ్ హైదరాబాద్‌కి ఫేవర్‌గా మారింది. చివరి ఓవర్‌లో 32 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఏదేమైనా.. నితీశ్ రానా, రింకూ సింగ్ పోరాడిన తీరుని మాత్రం మెచ్చుకోవాల్సిందే!

Exit mobile version