Sunrisers Hyderabad Scored 94 Runs With 2 Wickets Loss Against KKR: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. మొదటి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తొలి 10 ఓవర్లలో ఎస్‌హెచ్‌ఆర్‌కి ఇదే అత్యధిక స్కోరు. సన్‌రైజర్స్‌లోని అత్యంత ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ ఈ మ్యాచ్‌లో చితక్కొడుతున్నాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బాదుడు మొదలుపెట్టాడు. గతంలో చేసిన తప్పులతో గుణపాఠాలు నేర్చుకున్న బ్రూక్.. ఈసారి అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా, ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో ఎగబడుతున్నాడు. అందుకే.. హైదరాబాద్ స్కోర్ బోర్డు కూడా పరుగులు పెడుతోంది.
Amit Shah: బెంగాల్‌లో హిట్లర్ తరహా పాలన.. దీదీ సర్కారును గద్దె దించేది బీజేపీనే..
ఇక మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశపరిచాడు. 13 బంతులు ఆడిన అతగాడు, కేవలం 9 వ్యక్తిగత పరుగులతో పెవిలియన్ చేరాడు. రసెల్ బౌలింగ్‌లో కొంచెం ఎత్తుగా వచ్చిన బంతిని కీపర్ మీదుగా నుంచి పంపించాలని ప్రయత్నించాడు కానీ, అది నేరుగా స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. దాంతో అతడు ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి.. వచ్చి రాగానే రెండు ఫోర్లతో చెలరేగాడు. అదే ఊపులో షాట్ కొట్టబోతే.. అది గాల్లోకి ఎక్కువసేపు ఎగిరింది. దీంతో.. దాన్ని కీపర్ క్యాచ్‌గా అందుకున్నాడు. ఒకే ఓవర్‌లోనే ఈ రెండు వికెట్లు పడ్డాయి. ఈ వికెట్ల అనంతరం క్రీజులోకి వచ్చిన మర్ర్కమ్.. హ్యారీ బ్రూక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓవైపు హ్యారీ బ్రూక్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు కాబట్టి, అతనికి మద్దతు ఇస్తూ నిదానంగా రాణిస్తున్నాడు. ఇదే జోరుని సన్‌రైజర్స్ కొనసాగిస్తే.. కేకేఆర్‌కి భారీ లక్ష్యం ఇచ్చినట్టు అవుతుంది.
