Rain likely To Stop SRH vs LSG Match in Uppal Stadium Today: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సన్‌రైజర్స్, లక్నో టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరువ అవుతుంది. ఓడిన టీమ్ మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. ఈ కీలక మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. మ్యాచ్ జరిగే ఉప్పల్‌లో అయితే భారీ వర్షం పడింది. వర్షం కారణంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం జలమయమైంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచినా భారీగా నీళ్లు చేరాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో హైదరాబాద్, లక్నో మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Parth Jindal Angry: కోపంతో ఊగిపోయిన ఢిల్లీ ఓనర్ పార్త్ జిందాల్.. వీడియో వైరల్!
వర్షం కారణంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే చెరొక పాయింట్ లభించనుంది. దాంతో ఇరు జట్ల ఖాతాలలో 13 పాయింట్స్ ఉంటాయి. పట్టికలో చెన్నైని వెనక్కి నెట్టి 3, 4 స్థానాలకు చేరుకుంటాయి. అప్పుడు ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారుతుంది. చూడాలి మరి నేడు వరణుడు కరుణిస్తాడో లేదో. మ్యాచ్ రద్దయితే ఫాన్స్ కూడా నిరాశ చెందుతారు.
Heavy rain at the Uppal Stadium in Hyderabad. 🌧️pic.twitter.com/zSpSvmMSiK
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2024