NTV Telugu Site icon

Rohit -Hardik Pandya Fans Fight: స్టేడియంలో పొట్టు పొట్టు కొట్టుకున్న రోహిత్- హార్దిక్ ఫ్యాన్స్..

Rohit

Rohit

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య అభిమానులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం అప్పగించింది. ఈ నిర్ణయాన్ని రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకుని దారుణంగా విమర్శలు గుప్పిస్తున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ముంబై యాజమాన్యం తెలిపిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అసంతృప్తి చల్లారలేదు.. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హార్దిక్‌ పాండ్యాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.

Read Also: V.C. Sajjanar: డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్‌ కాల్స్‌.. జాగ్రత్త!

కాగా, టాస్ కోసం హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు ‘రోహిత్ రోహిత్’ అంటూ స్టేడియంలో అభిమానులు నినాదాలు చేశారు. రోహిత్ పేరుతో స్టేడియం మొత్తం మార్మోగింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ భారత క్రికెటర్‌కు ఇలాంటి వ్యతిరేకత గతంలో ఎప్పుడు చూడలేదని పీటర్సన్ తెలిపారు. అయితే, గుజరాత్-ముంబై మ్యాచ్ మధ్యలో రోహిత్, హార్దిక్ పాండ్యా అభిమానులు ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. ఆటగాళ్లపై అభిమానం ఉండాలి కానీ, ఇతరులను గాయపరిచేలా ఉండొద్దని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read Also: Rohit Sharma Vs Hardik: ముంబైతో మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు చుక్కలు చూపించిన రోహిత్ ఫాన్స్

అయితే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఇక, మ్యాచ్​ ముగిసిన తర్వాత రోహిత్​ శర్మ, హార్దిక్​ పాండ్యాల మధ్య హీటెడ్​ ఆర్గ్యుమెంట్​ జరిగినట్లు తెలుస్తుంది. రోహిత్​ ఎవరితోనో మాట్లాడుతుండగా.. వెనక నుంచి హార్దిక్ అతడిని హగ్​ చేసుకున్నాడు. కానీ, రోహిత్ అసహనంతో హార్దిక్ పై కోపగించుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. మ్యాచ్ ఓటమిపై రోహిత్ హార్దిక్ పాండ్యాతో సీరియస్ గా మాట్లాడుతున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు.