Rohit Sharma Creates Worst Record In IPL As Duckouts: ఐదు ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్‌గా ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డ్ నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అదే ఐపీఎల్ చరిత్రలో తన పేరిట అత్యంత చెత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా శనివారం (06-05-23) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు డకౌట్ అవ్వడంతో.. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రోహిత్ 16 సార్లు సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాత సునీల్ నరైన్ (15), మన్‌దీప్ సింగ్ (15), దినేశ్ కార్తీక్ (15) వరుస స్థానాల్లో నిలిచారు. కేవలం ఈ ఒక్క చెత్త రికార్డే కాదండోయ్.. ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మరో చెత్త రికార్డ్‌ని రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే ఔట్ అయిన కెప్టెన్‌గా (11) నిలిచాడు.
Khalistan Commando Chief: ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్‌జిత్ పంజ్వార్ హత్య!
కాగా.. ఎప్పుడూ ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తన స్థానాన్ని మార్చుకున్నాడు. ఓపెనర్‌గా తాను ఈ సీజన్‌లో పెద్దగా ఖాతా తెరవకపోవడంతో.. స్థానం మార్చడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని అనుకుని, వన్ డౌన్‌గా క్రీజులోకి దిగాడు. తొలి రెండు బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కున్న రోహిత్, మూడో బంతికి రివర్స్ స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. బ్యాట్‌ను తాకిన బంతి గాల్లోకి ఎగిరి, ఆఫ్ సైడ్‌లో ఉన్న మూడో స్లిప్పర్ చేతికి చిక్కింది. దీంతో.. సున్నా పరుగులకే రోహిత్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. రోహిత్ ఇలా ప్రతీసారి విఫలం అవుతుండడంతో.. అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకట్రెండు మ్యాచ్‌లైతే ఏమో అనుకోవచ్చు కానీ, ఇలా ప్రతీసారి ఫెయిల్ అవ్వడం ఏంటని విమర్శిస్తున్నారు. రోహిత్ తన ఆటతీరుపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని, కెప్టెన్‌గా ఉన్న అతగాడు మంచి ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య