Site icon NTV Telugu

RCB Fan : ఆర్సీబీ గెలవకపోతే… నా భార్యకు విడాకులు ఇస్తా..!

Rcb Fan

Rcb Fan

ఐపీఎల్ లో అన్ని జట్ల పరిస్థితి ఒకలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూటే సెపరేటు. తమ టీమ్ లో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేకున్నా..ఆ జట్టు తలరాత మాత్రం మారట్లేదు. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లే జట్టును ఛాంపియన్ గా నిలబెట్టలేకపోయారన్న విమర్శలు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది ఈ సాల కప్‌ నమదే అంటూ సందడి చేయడం… మిడ్ సీజన్లోనే చేతులెత్తేయడం అలవాటైపోయింది. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీకి అన్నివిధాలుగా కలిసొచ్చింది. బలమైన ప్రత్యర్థి జట్లను దాటుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మరోవైపు కావాల్సిన రన్ రేట్ ని మైంటైన్ చేస్తుంది.

Also Read : MISS WORLD-2025: నేడు మరో మూడు దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రాక

ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 16 పాయింట్లున్నాయి. అంటే అఫీషియల్ గా ప్లేఆప్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే. దీంతో అభుమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎప్పుడెప్పుడు కోహ్లీ టైటిల్ లిఫ్ట్ చేస్తాడా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి కూడా కప్ కొట్టకపోతే నా భార్యకు విడాకులిస్తానని ఓ ఫ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మీరు మీ భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీగా ఉండండని ఒకరు పోస్ట్ పెడితే.. మరో నెటిజన్.. తన భార్య ఆర్సీబీ టైటిల్ కొట్టొద్దని దేవుడ్ని మొక్కుకుంటుందని సెటైరికల్ కామెంట్ చేశాడు. ఏదేమైనా ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలని కోట్లాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం జట్టు బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్ విభాగంలోనూ సత్తా చాటుతుంది. చూడాలి మరి చివరకు ఎం జరుగుతుందో..

Also Read : PBKS vs LSG: సిక్సర్లతో రెచ్చిపోయిన పంజాబ్ బ్యాటర్లు.. లక్నో ముందు భారీ టార్గెట్.!

Exit mobile version