Ashwin Exit IPL: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ రెండ్రోజుల క్రితం ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ చెబుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అతడి నిర్ణయంపై సర్వత్రా చర్చ కొనసాగింది. చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే మినీ వేలానికి ముందే అశ్విన్ ను తప్పిస్తుందనే వార్తలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఇతర జట్లూ తీసుకొనేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని, అందుకే రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు క్రికెట్ పండితులు అంచనా వేశారు. తాజాగా తాను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను యూట్యూబ్ ఛానల్‌లో తెలియజేశాడు. ఐపీఎల్ కోసం దాదాపు 3 నెలల పాటు వేచి చూసేంత ఎనర్జీ తనకు లేదని అర్థమైందన్నాడు.
Read Also: AVATAR 3 : ట్రైలర్ రిలీజ్ తర్వాత తగ్గిన హైప్.. మరో మూడు నెలల్లో రిలీజ్
ఇక, నేను వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడగలనా? అని ఆలోచించాను.. 3 నెలలు ఐపీఎల్ నాకు ఎక్కువగా అనిపించింది అని అశ్విన్ తెలిపాడు. అందుకే, ఎంఎస్ ధోనీ లాంటి క్రికెటర్‌ను చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది.. వయస్సు పెరిగేకొద్దీ ఎవరికైనా ఐపీఎల్ ఆడేందుకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ, మహేంద్ర సింగ్ ధోనీకి అలాంటిదేమీ లేదు.. ఆట కోసం వేటగాడిలా నా కొత్త ప్రయాణం ప్రారంభం కానుందని రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్ చేశాడు.
Read Also: Patna: పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
అయితే, ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ఇతర దేశాల లీగుల్లో ఆర్. అశ్విన్ ఆడతాడని కథనాలు బయటకు వచ్చాయి. అతడు కూడా ధ్రువీకరించేలా ఈ వ్యాఖ్యలు చేశాడు. కొత్త లీగ్ కోసం తన పేరును నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో అతడు ఏ లీగ్‌లో ఆడతాడు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ది హండ్రెడ్, ఎస్‌ఏ 20లో ఏదో ఒక లీగ్‌లో ఆడతాడని టాక్. కానీ, ఎక్కడ అనేది అశ్విన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
