NTV Telugu Site icon

Ravichandran Ashwin: అశ్విన్ అరుదైన ఘనత.. ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ సొంతం

Ashwin New Record

Ashwin New Record

Ravichandran Ashwin Creates New Record In IPL: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 20 మంది బ్యాటర్లను డకౌట్‌ చేసిన తొలి బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో భాగంగా.. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడుని ఔట్ చేసిన తర్వాత అశ్విన్ ఈ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఏ ఒక్కరికీ సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అశ్విన్.. 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అటు.. అంబటి రాయుడు ఈ సీజన్‌లో ఏమంత ఆశాజనకంగా రాణించడం లేదు. ఇప్పటివరకూ అతని నుంచి ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా రాలేదు. గత సీజన్‌లో పరుగుల వర్షం కురిపించిన ఈ తెలుగు బ్యాటర్.. ఈసారి మాత్రం దారుణ ప్రదర్శనతో నిరుత్సాహపరుస్తూ వస్తున్నాడు.

PT Usha: వారి వల్ల దేశం పరువు పోతోంది.. పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాయస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్‌(77) అర్థశతకంతో చెలరేగగా.. చివర్లో జురేల్ (15 బంతుల్లో 34), పడిక్కల్ (13 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితం అయ్యింది. సీఎస్‌కే బ్యాటర్లలో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(47), దూబే (52) విజృంభించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో.. సీఎస్కే ఓటమి పాలైంది. ఆర్ఆర్ బౌలర్లలో ఆడం జంపా 3 వికెట్లు తీయగా.. అశ్విన్ రెండు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆర్ఆర్ జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచింది.

Dwayne Bravo: ధోనీ అందుకే బ్యాటింగ్‌కి దిగడు.. డ్వేన్ బ్రావో క్లారిటీ

Show comments