Site icon NTV Telugu

RR vs PBKS: ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. మళ్లీ ఓడిన రాజస్థాన్

Pbks

Pbks

RR vs PBKS: కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో 8వ విజయం అందుకున్న పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు మరో అడుగు దూరంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. ఇక, లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 209/7కే పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (50), వైభవ్ సూర్యవంశీ (40) మరోసారి అద్భుతమైన ఆరంభం ఇచ్చినా ఆర్ఆర్ కు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (20), రియాన్ పరాగ్ (13) దూకుడుగా ఆడలేకపోగా.. చివర్లో ధ్రువ్ జురెల్ (53) పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి సరైన హెల్ప్ లభించలేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక సమయంలో (3/22) వికెట్లు తీసి రాజస్థాన్‌ను చావు దెబ్బకొట్టాడు. యాన్సెన్, ఒమర్జాయ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

Read Also: CM Revanth Reddy: అసలైన కారణాలు ఏంటి? అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశాలు..

కాగా, టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. నేహల్ వధేరా (70), శశాంక్ సింగ్ (59) హాఫ్ సెంచరీలు బాదడంతో భారీ స్కోరు నమోదు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (21), శ్రేయస్ అయ్యర్ (30), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21) బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించారు. ఇక, ప్రియాంశ్‌ ఆర్య (9), మిచెల్ ఒవెన్ (0) మరోసారి నిరాశపర్చారు. అయితే, రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2, క్వెనా మఫాక, రియాన్ పరాగ్, ఆకాశ్‌ మధ్వాల్ తలో వికెట్ తీసుకున్నారు.

Exit mobile version