Site icon NTV Telugu

LSG vs PBKS: కష్టాల్లో పంజాబ్ కింగ్స్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!

Punjab Kings Innings

Punjab Kings Innings

Punjab Kings Scored 68 Runs In 10 Overs: లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు అతికష్టం మీద నెట్టుకొస్తోంది. తొలి పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులే చేసింది. ఈ జట్టు లక్ష్యాన్ని అందుకోవాలంటే.. మరో 10 ఓవర్లలో 92 పరుగులు చేయాల్సి ఉంటుంది. మొదట్లోనే ఈ జట్టుకు ఊహించని ఝలక్‌లకు తగిలాయి. సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. ఆ తర్వాత 17 వికెట్ల వద్ద మరో వికెట్ కోల్పోయింది. అప్పుడు క్రీజులో ఉన్న మాథ్యూ షార్ట్.. హర్‌ప్రీత్ సింగ్‌తో కలిసి జట్టుని ముందుకు నడిపించాడు. అయితే.. మాథ్యూ కుదురుకున్నాడని అనుకునేలోపే.. అతడు షాట్ కొట్టబోయి స్టోయినిస్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో.. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 45 పరుగులకి మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.

Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ అంటూ..

షార్ట్ ఔటయ్యాక పంజాబ్ కింగ్స్ జోరు నెమ్మదించింది. మరో వికెట్ పడకుండా ఉండేందుకు.. హర్‌ప్రీత్, సికందర్ రజా ఆచితూచి ఆడుతున్నారు. అటు లక్నో బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండగా.. ఆ ఇద్దరు బ్యాటర్లు అనవసరమైన షాట్ల జోలికి వెళ్లడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో వికెట్ పడితే, జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుందన్న ఉద్దేశంతో నిదానంగా ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. భారీ షాట్ల జోలికి వెళ్లడం లేదు. సింగిల్స్, డబుల్స్‌తోనే లాగించేస్తున్నారు. ఇక లక్నో బౌలర్ల విషయానికొస్తే.. యుధ్విర్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లు పంజాబ్ బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకుండా.. పొదుపుగా బౌలింగ్ వేస్తున్నారు. మరి.. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

LSG vs PBKS: ముగిసిన లక్నో బ్యాటింగ్.. పంజాబ్ ముందు 160 లక్ష్యం

Exit mobile version