Site icon NTV Telugu

IPL 2022 : చెలరేగిన పంజాబ్‌.. గుజరాత్‌ ముందు భారీ స్కోర్‌

Punjab Gujrat

Punjab Gujrat

ఐపీఎల్‌ 2022 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. తాజా సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ కోసం ఉరకలేస్తుండగా, టైటాన్స్ కు అడ్డుకట్ట వేయాలని పంజాబ్ కింగ్స్ ఆశిస్తోంది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 59, షారుక్‌ ఖాన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉ‍న్నాడు.

పంజాబ్‌ కింగ్స్‌ రెండు ఓవర్ల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాహుల్‌ చహర్‌ 4, వైభవ్‌ అరోరా ఒక్క పరుగులతో ఆడారు. పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి గుజరాత్‌ ముందు భారీ స్కోర్‌ నిలిపింది. లివింగ్‌స్టోన్‌ 27 బంతుల్లో 64 పరుగలుతో అదరగొట్టాడు. ధావన్‌ 35 పరుగులు చేయగా, చివర్లో రాహుల్‌ చహర్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ సహాయంతో 22 పరుగులు చేయడంతో పంజాబ్‌ భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3, దర్శన్‌ నల్కండే 2, పాండ్యా, ఫెర్గూసన్‌, షమీ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

Exit mobile version