NTV Telugu Site icon

Preity Zinta-IPL 2024: ప్రీతి జింటా చేసిన పొరపాటు.. పంజాబ్ కింగ్స్‌కు వరంలా మారింది!

Preity Zinta

Preity Zinta

Shashank Singh is a Star for PBKS in IPL 2024: డిసెంబర్ 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు. 19 ఏళ్ల బ్యాటర్‌కు బదులుగా.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు. శశాంక్‌ను సొంతం చేసుకున్న అనంతరం పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తమ పొరపాటును గ్రహించింది. అయితే పరువు పోకుండా శశాంక్ సింగ్ తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాడని కవర్ చేసింది.

వేలం సమయంలో ప్రీతి జింటా పొరపాటు చేసినా.. ఇప్పుడు అదే వరంలా మారింది. వద్దనుకున్న శశాంక్ సింగే.. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ భారీ స్కోర్ చేసేందుకు సాయపడ్డాడు. 19 ఓవర్లకు పంజాబ్ 6 వికెట్స్ కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. అయితే 20వ ఓవర్‌లో శశాంక్ సింగ్ చెలరేగాడు. ఆర్‌సీబీ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. దాంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. శశాంక్ హిట్టింగ్‌తో పంజాబ్ పోరాడే స్కోర్ చేసింది.

Also Read: Virat Kohli: ఇప్పటికీ నా పేరే.. జట్టులో స్థానం దక్కుతుంది: కోహ్లీ

ఐపీఎల్‌ 2024లో పంజాబ్ కింగ్స్‌ తొలి పరాజయం ఖాతాలో వేసుకుంది. ఆర్‌సీబీతో చివరివరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (45; 37 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో నాలుగు బంతులు ఉండగానే 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ ప్రధాన పేసర్లు అర్ష్‌దీప్‌ (3.2 ఓవర్లలో 40), హర్షల్‌ పటేల్‌ (1/45) ధారాళంగా పరుగులిచ్చారు.