Mumbai Indians Won By 14 Runs On Sunrisers Hyderabad: ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్ గెలుపొందింది. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేధించలేకపోయింది. 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. ముంబై జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మయాంక్ అగర్వాల్ పోరాటం, క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ పుణ్యమా అని ఈ మ్యాచ్ చివర్లో ఉత్కంఠభరితంగా మారింది కానీ.. చివర్లో భారీ షాట్లు బాదే ఆటగాడు లేకపోవడంతో ముంబైకి అనుకూలంగా మారింది. అర్జున్ టెండూల్కర్ వేసిన చివరి ఓవర్‌లో రెండు వికెట్లు (ఒకటి రనౌట్, మరొకటి క్యాచ్ ఔట్) పడటంతో.. హైదరాబాద్‌పై ముంబై విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌తో ముంబై హ్యాట్రిక్ నమోదు చేసింది.
Holy Places: ప్రకృతితో మిమ్మల్ని మమేకం చేసే 10 పవిత్ర స్థలాలు
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెమరాన్ గ్రీన్ (40 బంతుల్లో 60) అర్థశతకంతో రప్ఫాడించడం, తిలక్ వర్మ (17 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది. అంతకుముందు ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ (28), ఇషాన్ కిషన్ (38) కూడా జట్టుకి శుభారంభాన్ని ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి (7 పరుగులు) నిరాశపరిచాడు. ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కి ఆదిలోనే ఝలక్‌లు తగిలాయి. గత మ్యాచ్‌లో శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. ఈ మ్యాచ్‌లో 9 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి కూడా ఉసూరుమనిపించాడు. మర్ర్కమ్ (22) సైతం అంతంత మాత్రమే రాణించాడు. హైదరాబాద్ దాదాపు పట్టు కోల్పోవడంతో.. ముంబై భారీ తేడాతో విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు.
Mrunal Thakur: సీతా.. మోడ్రన్ లుక్ లో కూడా మెరిసిపోతున్నావ్
అలాంటి సమయంలో క్లాసెన్ (16 బంతుల్లో 36) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒక్కసారిగా ఇతడు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇతడ్ని చూసి మయాంక్ అగర్వాల్ (48) కూడా రెచ్చిపోయాడు. దీంతో.. మళ్లీ సన్‌రైజర్స్ ఆశలు చిగురించాయి. లక్ష్యానికి చేరువు అవ్వడంతో, మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కానీ.. ఇంతలోనే క్లాసెన్, అగర్వాల్ ఔట్ అవ్వడంతో హైదరాబాద్ మళ్లీ కష్టాల్లో పడింది. చివర్లో మార్కో, సుందర్‌లు గట్టిగానే ప్రయత్నించారు కానీ.. ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దిగిన అబ్దుల్ సమద్.. ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ముంబై బౌలర్లలో జేసన్, మెరిడిత్, పియూష్ తలా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, కెమరాన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.
