NTV Telugu Site icon

RCB vs MI: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ లక్ష్యం

Rcb Score 199

Rcb Score 199

Mumbai Indians Need 200 Runs To Win Match Against RCB: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండిన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (68), డు ప్లెసిస్ (65) అర్థశతకాలతో ఊచకోత కోయడం.. దినేశ్ కార్తిక్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఆర్సీబీ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ముంబై ఇండియన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. చూడ్డానికి లక్ష్యం పెద్దగానే ఉన్నా.. వాంఖడే లాంటి స్టేడియంలో దీన్ని ఛేధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అందునా.. ముంబైకి ఇది హోమ్‌గ్రౌండ్ కాబట్టి, కచ్ఛితంగా ఛేధించడానికి ప్రయత్నిస్తుంది.

Naveen Wul Haq : విరాట్ కోహ్లీని రెచ్చగొడుతున్న నవీన్ ఉల్ హాక్..

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆర్సీబీకి మొదట్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ (1) ఔట్ అయ్యాడు. అనంతరం కాసేపటికే అనుజ్ (6) పెవిలియన్ బాట పట్టాడు. ఇలా ఆదిలోనే రెండు వికెట్లు పోవడంతో.. ఆర్సీబీ బ్యాటర్లు ఒత్తిడికి గురవుతారని, తద్వారా స్కోరు నత్తనడకన సాగొచ్చని అందరూ అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ పరుగుల సునామీ సృష్టించారు. ఎడాపెడా షాట్లతో వీళ్లిద్దరు ఊచకోత కోశారు. ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ.. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఎలాంటి బంతులు వేసినా.. తమ 360 డిగ్రీ ఆటతో వీళ్లు ‘లెఫ్ట్ & రైట్’ వాయించేశారు. ముఖ్యంగా.. మ్యాక్స్‌వెల్ అయితే ఊరమాస్ ఇన్నింగ్స్‌తో మైదానాన్ని హోరెత్తించేశాడు. వీళ్లిద్దరు క్రీజులో ఉన్నంతసేపు మైదానంలో బౌండరీల మోత మోగింది. వీళ్లు మూడో వికెట్‌కి ఏకంగా 120 పరుగులు జోడించారు.

Hyderabad: రేపిస్ట్ నుంచి ఆరేళ్ల బాలికను సేవ్ చేసిన ర్యాపిడో డ్రైవర్

అయితే.. డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఔట్ అయ్యాక ఆర్సీబీ దూకుడు తగ్గుముఖం పట్టింది. వాళ్ల తర్వాత విధ్వంసకర బ్యాటర్లు లేకపోవడంతో.. స్కోరు నిదానంగా సాగింది. దినేశ్ కార్తిక్ మాత్రం కాస్త మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. అతడు ఆడిన ఆటతీరు చూసి.. ఈరోజు అతడు భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని భావించారు కానీ, ఇంతలోనే అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో అర్థశతకంతో చెలరేగిన లామ్రోర్ (1) ఈసారి డిజప్పాయింట్ చేశాడు. చివర్లో హసరంగ (12), కేదార్ జాధవ్ (12) ఏదో అలా లాక్కొచ్చారు. దీంతో.. ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మరి.. ముంబై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేధిస్తుందా?