Site icon NTV Telugu

Delhi Capitals: ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్ జంప్.. ఎందుకో తెలుసా?

Mitchell Marsh Marriage

Mitchell Marsh Marriage

Mitchell Marsh Flying Back To Home For His Marriage: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తాజాగా ఒక పెద్ద ఝలక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి జంప్ కాబోతున్నాడు. ఉన్నట్టుండి అతడు ఎందుకు వెళ్తున్నాడు? అనేగా మీ సందేహం! లేదు లేదు.. అతనికేం గాయాలు కాలేదు, కుటుంబ సభ్యుల కారణంగానో వెళ్లడం లేదు. ఒక మంచి కార్యం కోసం వెళ్తున్నాడు. ఆ మంచి కార్యం ఏదో కాదు.. అతని పెళ్లి. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌ వెల్లడించాడు. మార్ష్‌ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడని.. అందుకే అతడు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి గ్రెటా మ్యాక్స్‌తో ప్రేమలో మునిగితేలుతున్న మార్షల్.. రెండేళ్ల క్రితమే ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి సరైన ముహూర్తం కలిసిరాక.. రెండేళ్ల నుంచి వీళ్లు తమ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ నెలలో ముహూర్తం ఖరారు కావడంతో.. పెళ్లి బంధంతో ఒక్కటి అవ్వాలని ఆ జంట నిర్ణయించుకుంది. అందుకే.. ఐపీఎల్‌ని పక్కనపెట్టేసి, ఆస్ట్రేలియాకు మార్షల్ వెళ్తున్నాడు.

Nayanthara: పగిలిపోద్ది చెప్తున్నా.. అభిమానిపై నయన్ ఫైర్

ఇదిలావుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున మిచెల్ మార్ష్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. రెండు మ్యాచుల్లోనూ అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. తొలుత లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ డకౌట్‌ అయ్యాడు. మార్క వుడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి, గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అనంతరం.. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా మిచెల్ చేతులెత్తేశాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న అతగాడు.. ఒక ఫోర్ సహకారంతో నాలుగు పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే.. అదే మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన మార్ష్, విజయ్‌ శంకర్‌ను అవుట్‌ చేసి, తన ఖాతాలో ఓ వికెట్‌ వేసుకున్నాడు. కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం మిచెల్ మార్ష్‌ను రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. ఇప్పటివరకూ ఆ అమౌంట్‌కి న్యాయం చేసే ఇన్నింగ్స్ అతడు ఆడలేదు. ఇప్పుడేమో పెళ్లి కోసమని స్వదేశానికి వెళ్తున్నాడు. మరి, తిరిగొచ్చాక సత్తా చాటుతాడా? లేదా? అన్నది వేచి చూడాలి.

Wife Kidnap Drama: బోల్తాకొట్టిన కిడ్నాప్ డ్రామా.. అడ్డంగా దొరికిన భార్య

Exit mobile version