NTV Telugu Site icon

MI vs RCB: ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అతడే మా కొంపముంచాడు: డుప్లెసిస్‌

Faf Du Plessis Rcb

Faf Du Plessis Rcb

Faf du Plessis on RCB Defeat vs MI: ముంబై ఇండియన్స్‌పై ఓటమిని తాము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ తెలిపాడు. ఈ వికెట్‌పై 190 పైగా స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవడం అంత ఈజీ కాదని, పవర్‌ప్లేలో తాము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడని, అతడు ఎక్కువ పరుగులు చేయడకుండా అడ్డుకున్నాడని డుప్లెసిస్‌ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ముంబై కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.

మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాప్‌ డుప్లెసిస్‌ మాట్లాడుతూ… ‘ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఓటమికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మంచుతో కూడిన పరిస్థితులు అయితే, రెండోది టాస్‌ గెలిచి ఉండాల్సింది. అంతేకాదు ముంబై ప్లేయర్స్ బాగా ఆడి మాపై ఒత్తిడి తెచ్చారు. ఈ మ్యాచ్‌లో మేము కూడా చాలా తప్పులు చేశాము. పవర్‌ ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని మాకు తెలుసు. మేం 250 పైగా పరుగులు చేయాల్సింది. కానీ 196కే పరిమితం అయ్యాము’ అని తెలిపాడు.

Also Read: Premalu OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’.. తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

‘రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ముంబై ప్లేయర్స్ బౌలింగ్‌లో కూడా అద్బుతంగా రాణించారు. రజత్ పాటిదార్‌, నేను క్రీజులో ఉన్నప్పుడు భారీ స్కోర్‌ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. డెత్‌ ఓవర్లలో సూపర్‌ బౌలింగ్‌ చేశాడు. బుమ్రాలో చాలా నైపుణ్యాలు ఉన్నాయి. ఒత్తిడిలో కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. అతడిని ఎటాక్‌ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ మార్గదర్శకత్వంలో అతను మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. బుమ్రా లాంటి క్లాస్‌ బౌలర్‌ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్‌ అంత పటిష్టంగా లేదని తెలుసు. కాబట్టి వచ్చే మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధించాలి’ అని డుప్లెసిస్‌ చెప్పుకోచ్చాడు.

Show comments