ఐపీఎల్ 2026లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. పాయింట్ల పట్టికలో 9వ, 10వ స్థానంలో ఉన్న జట్ల మధ్య ఈ మ్యాచ్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, లక్నో 7 మ్యాచ్‌లు ఆడి, ఐదింటిలో ఓడిపోయి, కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. కోల్‌కతా కూడా 7 మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయి, కేవలం ఒకదానిలో మాత్రమే గెలిచింది. కోల్‌కతా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కేవలం 3 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్‌లో, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, KKR కెప్టెన్ అజింక్య రహానే ఇద్దరూ తిరిగి విజయాల బాట పట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

Kkr Vs Lsg