Site icon NTV Telugu

KKR vs MI: 9.15 గంటలకు కోల్‌కతా, ముంబై మ్యాచ్‌ ఆరంభం!

Eden Gardens

Eden Gardens

KKR vs MI Toss: ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పటికే మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండే. అయితే కోల్‌కతాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో.. ఇంకా టాస్‌ కూడా పడలేదు. ప్రస్తుతం వరుణుడు శాంతించాడు. దాంతో మైదాన సిబ్బంది గ్రౌండ్‌ని సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారు. మైదానంలోని కవర్లపై ఉన్న నీటిని బయటికి పంపిస్తున్నారు. 8.45 గంటలకు అంపైర్లు గ్రౌండ్‌ని పరిశీలించి.. రాత్రి 9 గంటలకు టాస్‌ ఉంటుందని ప్రకటించారు.

కోల్‌కతా, ముంబై జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 9.15 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా ఇరు జట్లు 16 ఓవర్లు ఆడనున్నాయి. ఈ సీజన్‌లో కోల్‌కతా దూసుకెళుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబైపై గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. మరోవైపు ముంబై ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. 12 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలే సాధించి.. ప్లేఆఫ్స్‌ రేసు నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా, ముంబై జట్లు 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 23 మ్యాచ్‌ల్లో గెలిచింది.

Exit mobile version