Site icon NTV Telugu

IPL 2024 Playoffs: సీఎస్‌కేకు భారీ షాక్.. ప్లేఆఫ్స్‌కు ఆర్‌సీబీ!

Csk Won

Csk Won

Jio Cinema Prediction on IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో లీగ్ దశ ముగియనుంది. దాదాపుగా అన్ని జట్లు 12 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్క టీమ్ కూడా అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను దక్కించుకోలేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. 8 జట్లు రేసులో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ప్లేఆఫ్స్‌ బెర్త్‌లను దాదాపు ఖరారు చేసుకోగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం 6 జట్లు పోటీపడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌ చేరే జట్లను అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమా అంచనా వేసింది. రాజస్థాన్, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు టీమ్స్ ప్లేఆఫ్స్‌ చేరుతాయని జోస్యం చెప్పింది. చెన్నైకి జియో సినిమా భారీ షాక్ ఇచ్చింది. చెన్నై మిగతా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి.. లీగ్ నుంచి నిష్క్రమిస్తుందని పేర్కొంది. పంజాబ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలుస్తుందని జియో సినిమా తెలిపింది. ఇక లక్నో, గుజరాత్, ముంబై జల్టు వరుసగా 7, 8, 9 స్థానాలతో ఉంటాయని చెప్పుకొచ్చింది.

Also Read: Delhi Capitals Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌!

రాజస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో చెన్నై, పంజాబ్, కోల్‌కతాలను ఓడించి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలుస్తుందని జియో సినిమా జోస్యం చెప్పింది. కోల్‌కతా తదుపరి మ్యాచ్‌ల్లో ముంబై, గుజరాత్‌పై గెలిచి.. రాజస్థాన్ చేతిలో ఓడుతుందని తెలిపింది. హైదరాబాద్ టీమ్ గుజరాత్‌ చేతిలో ఓడి.. పంజాబ్‌పై విజయం సాధిస్తుందని పేర్కొంది. చెన్నై తదుపరి రెండు మ్యాచ్‌లలో రాజస్థాన్, బెంగళూరు చేతిలో ఓడి ఇంటిదారి పడుతుందని జియో సినిమా తెలిపింది. ఇక బెంగళూరు తదుపరి మ్యాచ్‌లలో ఢిల్లీ, చెన్నైలను ఓడించి ప్లేఆఫ్స్‌ చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం జియో సినిమా ప్రిడిక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై విషయంలో జియో సినిమా ప్రిడిక్షన్ తప్పవుతుందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరుకు బదులుగా చెన్నైప్లేఆఫ్స్‌ చేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version