Site icon NTV Telugu

Kolkata Knight Riders: కోల్‌కతా పంట పండింది.. శ్రేయస్ స్థానంలో ఆ స్టార్ ప్లేయర్

Jason Roy Replace Shreyas

Jason Roy Replace Shreyas

Jason Roy Replace Shreyas Iyer In IPL: వెన్ను సమస్య కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికే దూరమైన సంగతి తెలిసిందే! దీంతో.. నితీశ్ రానాను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కానీ.. శ్రేయస్ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పుడు ఈ మిస్టరీకి తెరదించుతూ.. జేసన్ రాయ్‌ని రంగంలోకి దింపారు. ఇది కేకేఆర్ జట్టుకి నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. జేసన్ రాయ్ ఒక విధ్వంసకర బ్యాటర్. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే మాత్రం.. ప్రత్యర్థి జట్టుకి ఇక దబిడిదిబిడే! అఫ్‌కోర్స్.. ఐపీఎల్‌లో అతడు ఇంతవరకూ తనదైన విశ్వరూపం చూపించలేదు కానీ, నిలకడగా రానిస్తే మాత్రం రచ్చరచ్చే. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. 129 స్ట్రైక్ రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Hardik Pandya: రాసి పెట్టుకోండి.. రెండేళ్లలో అతడు తురుపుముక్క అవుతాడు

అయితే.. ఇదే సమయంలో కేకేఆర్ ఓ ఎదురుదెబ్బ కూడా తగిలింది. కీలక ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌ సీజన్‌ మొత్తానికే అందుబాటులో ఉండడం లేదని బాంబు పేల్చాడు. అంతర్జాతీయంగా కమిట్‌మెంట్లు ఉండటంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల తనకు ఐపీఎల్‌-2023కు అందుబాటులో ఉండటం కుదరదని షకీబ్‌ పేర్కొన్నాడు. అతనితో పాటు బంగ్లాదేశ్‌కి చెందిన లిటన్ దాస్ కూడా ఏప్రిల్ 10వ తేదీ వరకూ అందుబాటులో ఉండట్లేదు. ఐర్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ కారణంగా.. తనకు 10వ తేదీ వరకు గడువు ఇవ్వా్ల్సిందిగా ఫ్రాంచైజీని కోరాడు. ఇదిలావుండగా.. నితీశ్ రానా సారథ్యంలో కేకేఆర్ ఈ సీజన్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడింది. అయితే.. డవ్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైంది.

Manchu Vishnu: ఇక స్వచ్ఛత పైనే మోహన్ బాబు వర్శిటీ ఫోకస్

Exit mobile version