NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్ పాండ్యాను హెచ్చరించిన అంబానీ ఫ్యామిలీ.. ముంబై గెలవకపోతే..!

Hardik Pandya Mi

Hardik Pandya Mi

Is Ambani Family Warns Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లోనూ ఆలస్యంగా గెలుపు బాట పట్టిన ముంబై.. హ్యాట్రిక్ ఓటములతో వెనకపడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 3 గెలిచి, 5 ఓడిపోయింది. ప్రస్తుతం ముంబై 6 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ముంబై ఆడాల్సిన తదుపరి ఆరు మ్యాచ్‌ల్లో కనీసం 5 గెలిస్తేనే.. ప్లే ఆఫ్‌కు అవకాశాలు ఉంటాయి. లేదంటే అంతే సంగతులు.

ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత సీజన్ నుంచి ముంబై పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో గత మూడు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్‌కు చేరింది. దీంతో ముంబై కెప్టెన్‌గా ఉన్న రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా అంబానీ ఫ్యామిలీ నియమించింది. గుజరాట్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన హార్దిక్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి.. సారథిని చేసింది. కానీ హార్దిక్ మాత్రం తన మ్యాజిక్‌ చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాకుండా.. కెప్టెన్‌గానూ తేలిపోయాడు. ఓ సారథిగా కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలోనూ తడబడుతున్నాడు.

Also Read: Gangs of Godavari: విశ్వక్‌ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్‌కు ముహూర్తం ఖరారు!

ప్రస్తుతం హార్దిక్ పాండ్యాపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో హార్దిక్‌కు అండగా ఉండాల్సిన ముంబై ఇండియన్స్ యజమాన్యం గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో ముంబైని కనీసం ప్లే ఆఫ్‌కు అయినా చేర్చాలని అంబానీ ఫ్యామిలీ హార్దిక్‌ను హెచ్చరించిందని సమాచారం. లేదంటే కెప్టెన్సీ నుంచి తప్పిస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది మెగా వేలం ఉన్న విషయం తెలిసిందే.