Irfan Pathan Praises Shardul Thakur For His Incredible Innings Against RCB: ఏప్రిల్ 7వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎలా తాండవం చేశాడో అందరికీ తెలుసు. టాపార్డర్‌తో స్టార్ బ్యాటర్లు చేతులెత్తేస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శార్దూల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి, 150 పరుగులు చేయడం కేకేఆర్‌కి గగనమేనని అనుకున్న తరుణంలో.. ఇతడు విలయతాండవం చేసి జట్టుకి భారీ స్కోరుని అందించాడు. కేవలం 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేసిన శార్దూల్.. రింకూ సింగ్‌తో కలిసి ఆరో వికెట్‌కి అక్షరాల 103 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. శార్దూల్ కారణంగానే ఆర్సీబీపై కేకేఆర్ 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఈ నేపథ్యంలోనే శార్దూల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులు ‘లార్డ్ శార్దూల్’ అంటూ ఆకాశానికెత్తేస్తుండగా.. మాజీలు సైతం అతడ్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.
Snake: ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి వెళ్లిందని ఆస్పత్రికి పరుగెత్తాడు.. తర్వాత ఏమైందంటే?
తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం శార్దూల్‌పై ప్రశంసలతో ముంచెత్తాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు శార్దూల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా ప్రశంసనీయం. కేకేఆర్ టాపార్డర్, స్టార్ బ్యాటర్లు డగౌట్‌లో కూర్చున్న వేళ.. శార్దూల్ మైదానంలోకి దిగి, ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ధీటుగా బదులిచ్చాడు. ఒక్కసారిగా అతడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. నిజానికి.. ఆండ్రీ రసెల్, నితీశ్ రాణా, మన్‌దీప్ సింగ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహిస్తాం. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ, శార్దూల్ చెలరేగిన తీరు అద్బుతం. ఎవరూ ఊహించని రీతిలో మెరుపు అతడు ఇన్నింగ్స్ ఆడాడు. టీ20లలో అతడికి ఇదే అత్యధిక స్కోరు. వికెట్లు తీస్తాడని.. ఆరు, ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. తనను ఎంపిక చేసి, కేకేఆర్ యాజమాన్యం ఎలాంటి తప్పు చేయలేదని శార్దూల్ నిరూపించుకున్నాడు’’ అని అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
Bengaluru Auto Rickshaw: ఒకే ఆటోకు 3 రిజిస్ట్రేషన్ నంబర్లు.. ఇదేలా సాధ్యం?