చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య రసవత్తర పోరు మొదలైంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఈ రెండు జట్లకు టోర్నమెంట్‌లో నిలదొక్కుకోవడానికి ఈ విజయం అత్యంత కీలకం.
టాస్ గెలిచిన అనంతరం రహానే మాట్లాడుతూ.. “మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడి పిచ్ పరిస్థితులు మా బౌలర్లకు ఆరంభంలో సహకరిస్తాయని భావిస్తున్నాం. మా జట్టు ఇప్పటివరకు విజయం నమోదు చేయకపోయినా, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గలేదు. గతంలో ఇక్కడ ఆడిన రికార్డు మాకు అనుకూలంగా ఉంది. ఒక మంచి ఆరంభం లభిస్తే మ్యాచ్‌ను మా వైపు తిప్పుకోగలమని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగడంపై రుతురాజ్ స్పందిస్తూ.. “మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం, కానీ టాస్ మన చేతుల్లో ఉండదు. గత మ్యాచ్‌లో సంజు శాంసన్ సెంచరీతో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా మా టాప్ ఆర్డర్ రాణించడం ముఖ్యం. చెపాక్ మా హోమ్ గ్రౌండ్, ఇక్కడ భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడమే మా లక్ష్యం” అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read:Surya Kumar Yadav: ప్రమాదంలో సూర్యకుమార్ యాదవ్ కెరీర్..? అదొక్కటే దారి..
వరుసగా మూడు ఓటముల తర్వాత సంజు శాంసన్ అద్భుత సెంచరీ పుణ్యమా అని గత మ్యాచ్‌లో చెన్నై తొలి విజయాన్ని అందుకుంది. శాంసన్ ఫామ్ చెన్నైకి అతిపెద్ద బలం. అయితే, కేకేఆర్ ఇప్పటికీ బోణీ కొట్టలేదు. కానీ చెపాక్ స్టేడియంలో గత మూడు మ్యాచుల్లో రెండింటిని కేకేఆర్ గెలుచుకోవడం వారికి కలిసొచ్చే అంశం. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లతో చెన్నైని కట్టడి చేయాలని కేకేఆర్ భావిస్తుంటే, రుతురాజ్ మరియు దూబేల బ్యాటింగ్ పవర్‌తో కేకేఆర్ బౌలింగ్‌ను చిత్తు చేయాలని సిఎస్‌కే యోచిస్తోంది.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, క్రెయిగ్ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్జపనీత్ సింగ్.
(ఇంపాక్ట్ సబ్: మాథ్యూ షార్ట్, అకీల్ హొస్సేన్, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, మాట్ హెన్రీ)
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా.
(ఇంపాక్ట్ సబ్: మనీష్ పాండే, ఫిన్ అలెన్, తేజస్వి, నవదీప్ సైనీ, టిమ్ సీఫెర్ట్)
