Site icon NTV Telugu

IPL 2025 Final Live Updates: పంజాబ్ vs ఆర్సీబీ మధ్య హైఓల్టేజ్‌.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్..

Ipl 2025

Ipl 2025

IPL 2025 Final Live Updates: అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదించడానికి బరిలోకి దిగారు పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు. ఈ రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎందుకంటే ఇటు పంజాబ్‌ కింగ్స్‌, అటు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు గత 18 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది.. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్ మీకోసం..

The liveblog has ended.
  • 03 Jun 2025 11:27 PM (IST)

    ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా ఆర్సీబి

    ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 పరుగులతో విజయం. ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా ఆర్సీబి.

  • 03 Jun 2025 11:22 PM (IST)

    19 ఓవర్లు పంజాబ్ స్కోర్ 162/7

    19 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో శశాంక్ సింగ్ (39), జమీసన్ (0) పరుగులతో ఉన్నారు.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 13 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 11:19 PM (IST)

    18 ఓవర్లు పంజాబ్ స్కోర్ 149/7

    18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో శశాంక్ సింగ్ (26), జమీసన్ (0) పరుగులతో ఉన్నారు.. యాష్ దయాల్ బౌలింగ్ లో 5 పరుగులు, ఒక వికెట్ వచ్చాయి.

  • 03 Jun 2025 11:14 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్..

    ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. యాష్ దయాల్ బౌలింగ్ లో భాండగే కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లిన అజమాతుల్లాహ్ ఓమర్జా (1).

  • 03 Jun 2025 11:13 PM (IST)

    17 ఓవర్లు పంజాబ్ స్కోర్ 144/6

    17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో శశాంక్ సింగ్ (23), అజమాతుల్లాహ్ ఓమర్జా(1) పరుగులతో ఉన్నారు.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 8 పరుగులు, 2 వికెట్లు వచ్చాయి.

  • 03 Jun 2025 11:09 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్..

    ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో యాష్ దయాల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లిన స్టోనిస్స్ (6).

  • 03 Jun 2025 11:07 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్..

    ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో కృనాల్ పాండ్యా కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లిన నేహాల్ వధేరా (15).

  • 03 Jun 2025 11:05 PM (IST)

    16 ఓవర్లు పంజాబ్ స్కోర్ 136/4

    16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో నేహాల్ వధేరా (15), శశాంక్ సింగ్ (22) ఉన్నారు.. హెజిల్ వుడ్ బౌలింగ్ లో ఏకంగా 17 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 10:59 PM (IST)

    15 ఓవర్లు పంజాబ్ స్కోర్ 119/4

    15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో నేహాల్ వధేరా (13), శశాంక్ సింగ్ (9) ఉన్నారు.. రొమారియో షెపర్డ్ బౌలింగ్ లో 13 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 10:54 PM (IST)

    14 ఓవర్లు పంజాబ్ స్కోర్ 106/4

    14 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో నేహాల్ వధేరా (6), శశాంక్ సింగ్ (3) ఉన్నారు.. సుయాశ్ శర్మ బౌలింగ్ లో కేవలం 5 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 10:46 PM (IST)

    వంద పరుగులు దాటిన పంజాబ్ స్కోర్..

    13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో నేహాల్ వధేరా (3), శశాంక్ సింగ్ (2) ఉన్నారు.. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో 3 పరుగులు, ఒక వికెట్ వచ్చాయి.

  • 03 Jun 2025 10:43 PM (IST)

    నాలుగవ వికెట్ కోల్పోయిన పంజాబ్..

    నాలుగవ వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో లివింగ్ స్టోన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లిన జోష్ ఇంగ్లీష్ (39)

  • 03 Jun 2025 10:41 PM (IST)

    12 ఓవర్లు పంజాబ్ స్కోర్ 98/3

    12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లీష్ (39), నేహాల్ వధేరా (2) ఉన్నారు.. రొమారియో షెపర్డ్ బౌలింగ్ లో 10 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 10:37 PM (IST)

    11 ఓవర్లు పంజాబ్ స్కోర్ 88/3

    11 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లీష్ (31), నేహాల్ వధేరా (1) ఉన్నారు.. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో 7 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 10:36 PM (IST)

    10 ఓవర్లు పంజాబ్ స్కోర్ 81/3

    10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లీష్ (24), నేహాల్ వధేరా (1) ఉన్నారు.. రొమారియో షెపర్డ్ బౌలింగ్ లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 03 Jun 2025 10:30 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్

    మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. రొమారియో షెపర్డ్ బౌలింగ్ లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెనుదిరిగిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (1).

  • 03 Jun 2025 10:24 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్..

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26)

  • 03 Jun 2025 10:20 PM (IST)

    8 ఓవర్లు పంజాబ్ స్కోర్ 70/1

    8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (25), జోష్ ఇంగ్లీష్ (16) ఉన్నారు.. సుయాష్ శర్మ వేసిన ఏడో ఓవర్‌లో ఏకంగా 15 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 10:15 PM (IST)

    7 ఓవర్లు పంజాబ్ స్కోర్ 55/1

    7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17), జోష్ ఇంగ్లీష్ (9) ఉన్నారు.. కృనాల్ పాండ్యా వేసిన ఏడో ఓవర్‌లో కేవలం 3 పరుగులే వచ్చాయి.

  • 03 Jun 2025 10:09 PM (IST)

    6 ఓవర్లు పంజాబ్ స్కోర్ 52/1 పరుగులు..

    పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15), జోష్ ఇంగ్లీష్ (8) ఉన్నారు.. యశ్‌ దయాళ్ వేసిన ఆరో ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 10:03 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. హేజిల్ వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో చివరి బంతికి బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ సూపర్‌ క్యాచ్ అందుకోవడంతో ప్రియాంశ్‌ ఆర్య పెవిలియన్ కు వెనుదిరిగాడు.

  • 03 Jun 2025 09:57 PM (IST)

    4 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 32 పరుగులు..

    4 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 32 పరుగులు.. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య (15), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (13) ఉన్నారు..

  • 03 Jun 2025 09:48 PM (IST)

    రెచ్చిపోతున్న పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు..

    చెలరేగిపోయి బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ జోడి.. మొదటి రెండు ఓవర్లకే 23 పరుగులు చేసిన పంజాబ్.. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య (11), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (8) ఉన్నారు..

  • 03 Jun 2025 09:24 PM (IST)

    తడబడిన ఆర్సీబీ.. నిర్ణీయ 20 ఓవర్లకు 190 పరుగులే..

    ఐపీఎల్ ఫైనల్ లో తడబడిన ఆర్సీబీ.. నిర్ణీయ 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చివరి ఓవర్లలో 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బకొట్టిన అర్ష్‌దీప్ సింగ్

  • 03 Jun 2025 09:22 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 19.4 ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ లో శ్రేయాస్ అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన కృనాల్ పాండ్యా..

  • 03 Jun 2025 09:20 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 19.2 ఓవర్‌ వేసిన అర్ష్ దీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన రొమారియో షెఫర్డ్ (17).

  • 03 Jun 2025 09:18 PM (IST)

    ఆర్సీబీ 19 ఓవర్లకు 187 పరుగులు..

    ఆర్సీబీ 19 ఓవర్లకు కీలకమైన ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. క్రీజులో రొమారియో షెఫర్డ్ (17), కృనాల్ పాండ్య (3) ఉన్నారు.

  • 03 Jun 2025 09:10 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది.. 24 పరుగులకే జితేష్ శర్మ క్లీన్ బౌల్డ్.. వైషాక్ విజయ్ కుమార్ వేసిన 17.4 ఓవర్‌లో ఔట్ అయిన జితేష్..

  • 03 Jun 2025 08:49 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్..

    నాలుగో వికెట్‌ కోల్పోయిన బెంగళూరు. విరాట్ కోహ్లీ ఔట్.. 35 బాల్స్‌లో 43 పరుగులు చేసిన విరాట్..

  • 03 Jun 2025 08:38 PM (IST)

    13 ఓవర్లకు 111 పరుగులు చేసిన ఆర్సీబీ..

    ఆర్సీబీ 13 ఓవర్లకు కీలకమైన మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (35), లివింగ్‌స్టన్ (6) పరుగులతో ఉన్నారు. వైషాక్ విజయ్ కుమార్ వేసిన 13వ ఓవర్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

  • 03 Jun 2025 08:33 PM (IST)

    100 పరుగుల మార్క్ దాటిన ఆర్సీబీ..

    ఆర్సీబీ 12 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 103 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (32), లివింగ్‌స్టన్ (3) పరుగులతో ఉన్నారు.
    చాహల్ వేసిన 12వ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు వచ్చాయి.

  • 03 Jun 2025 08:25 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    96 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది.. కెప్టెన్ రజత్ పటీదార్ (26) ఔట్.. జేమీసన్ వేసిన 10.5 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన పటీదార్.. అంతకుముందు ఇదే ఓవర్‌లో సిక్స్ కొట్టిన రజత్ పటీదార్.. 11 ఓవర్లకు ఆర్సీ స్కోరు 97/3.. విరట్ కోహ్లీ (28), లివింగ్‌స్టన్ (1) క్రీజులో ఉన్నారు.

  • 03 Jun 2025 08:21 PM (IST)

    10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 87/2 పరుగులు..

    ఆర్సీబీ 10 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 87 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (27), రజత్ పాటిదార్ (18) ఉన్నారు. ఒమర్జాయ్ బౌలింగ్ లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి.

  • 03 Jun 2025 08:15 PM (IST)

    9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 80/2 పరుగులు..

    ఆర్సీబీ 9 ఓవర్లకు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (21), రజత్ పాటిదార్ (17) ఉన్నారు.

  • 03 Jun 2025 08:11 PM (IST)

    8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 69/2 పరుగులు..

    ఆర్సీబీ 8 ఓవర్లకు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (19), రజత్ పాటిదార్ (8) ఉన్నారు.

  • 03 Jun 2025 08:03 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    ఆర్సీబీకి మరో షాక్.. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో అర్ష్ దీప్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టిన మయాంక్ అగర్వాల్ (24)..

  • 03 Jun 2025 08:02 PM (IST)

    పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ స్కో 55/1 పరుగులు..

    పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ వికెట్ నష్టానికి 55 పరుగులు.. మయాంక్ అగర్వాల్ (24), విరాట్ కోహ్లీ (13) క్రీజులో ఉన్నారు..

  • 03 Jun 2025 07:53 PM (IST)

    ఆర్సీబీ స్కోర్ 4 ఓవర్లకు 39/1 పరుగులు..

    ఆర్సీబీ 4 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (14), విరాట్ కోహ్లీ (7) ఉన్నారు.

  • 03 Jun 2025 07:48 PM (IST)

    మూడు ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 30/1 పరుగులు..

    ఆర్సీబీ 3 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (10), విరాట్ కోహ్లీ (2) ఉన్నారు.

  • 03 Jun 2025 07:45 PM (IST)

    రెండు ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 19/1 పరుగులు

    2 ఓవర్లకు స్కోరు ఒక వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 19 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (1), విరాట్ కోహ్లీ (1) ఉన్నారు.

  • 03 Jun 2025 07:39 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..

    ఆర్సీబీకి బిగ్ షాక్.. రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు.. 16 పరుగులకే ఫిల్ సాల్ట్ అవుట్.. కైల్ జేమీసన్ వేసిన 1.4 ఓవర్‌కు భారీ షాట్ ఆడగా గాల్లోకి లేచిన బంతిని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుకోవడంతో.. పెవిలియన్ కు వెళ్లిపోయిన సాల్ట్..

  • 03 Jun 2025 07:36 PM (IST)

    తొలి ఓవర్లో 13 పరుగులు..

    ఆర్సీబీ, పంజాబ్ మధ్య ఫైనల్ మ్యాచ్ వైడ్‌తో ప్రారంభమైంది.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. తొలి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ మొదటి బంతినే వైడ్‌గా వేశాడు.. మొదటి ఓవర్లో 13 పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్

  • 03 Jun 2025 07:31 PM (IST)

    ఐపీఎల్ ఫైనల్ కు అంపైర్లు వీరే..

    పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు అంపైర్లుగా నితిన్ మీనన్, మదన్ గోపాల్ వ్యవహరించనున్నారు..

  • 03 Jun 2025 07:24 PM (IST)

    ఐపీఎల్ కప్ ఎత్తిన విరాట్ కోహ్లీ.. నెట్టింట్ ఫోటో హల్​చల్

    ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్ ఎత్తిన ఏఐ ఫోటోను సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు..

  • 03 Jun 2025 07:18 PM (IST)

    ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది: శ్రేయాస్ అయ్యర్

    నా మనసుకు, నా శరీరానికి సానుకూల సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాను.. ఇది అద్భుతమైన రోజు.. జనం ఉత్సాహంగా ఉన్నారు.. మనం చేయాల్సిందల్లా ఇక్కడికి వచ్చిన వారిని ఆదరించడం.. నా టీమ్‌మేట్స్‌ కూడా ఉత్సాహంగా ఉన్నారు.. టీమ్ మీటింగ్‌లో కూడా అదే మాట్లాడుకున్నాం., మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అని చెప్పాను: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

  • 03 Jun 2025 07:14 PM (IST)

    ఆర్సీబీ- పంజాబ్ ఇంపాక్ట్ సబ్స్..

    ఆర్సీబీ- పంజాబ్ ఇంపాక్ట్ సబ్స్..

    ఆర్సీబీ ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్‌ సలామ్, మనోజ్ భాడ్గే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాశ్ శర్మ
    పంజాబ్ ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్‌ దూబె, సుర్యాంశ్‌ షెడ్గే, బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్

  • 03 Jun 2025 07:09 PM (IST)

    ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జట్లు ఇవే..!

    ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జట్లు ఇవే..
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్.

    పంజాబ్ కింగ్స్ జట్టు: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్( వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

  • 03 Jun 2025 07:02 PM (IST)

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్..తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..

  • 03 Jun 2025 06:58 PM (IST)

    ఫైనల్ కోసం వచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు..

    ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ

  • 03 Jun 2025 06:53 PM (IST)

    కన్ఫూజన్ లో క్రిస్ గేల్..

    గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తరఫున ఆడిన క్రిస్ గేల్.. ఐపీఎల్ ఫైనల్ లో ఏ జట్టుకు మద్దతు ఇవ్వలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న గేల్.. ఇక, ఆర్సీబీ జెర్సీని ధరించడంతో పాటు పంజాబ్‌ను సపోర్ట్ చేస్తున్నాననే విషయాన్ని తెలియజేయడం కోసం తలపాగా చుట్టుకున్నాడు క్రిస్ గేల్.

Exit mobile version