NTV Telugu Site icon

RCB vs CSK: బెంగళూరు, చెన్నై మ్యాచ్‌ కష్టమే.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు!

Rcb Vs Csk

Rcb Vs Csk

What will happen if RCB vs CSK Match gets washed out: గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌ అవకాశాలపై నీళ్లు చల్లిన వరణుడు.. మరో మ్యాచ్‌పై కన్నేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం (మే 18) చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మ్యాచ్‌ను వరణుడు అడ్డుకోనున్నాడట. ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌ చేరాలంటే ఆర్‌సీబీ, సీఎస్‌కే‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఆర్‌సీబీపై గెలిస్తే సీఎస్‌కే‌ నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. ఇతర జట్లపై ఆధారపడకుండా ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కించుకుంటుంది. ఆర్‌సీబీపై ఓడితే.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే 15 పాయింట్లతో సీఎస్‌కే‌.. హైదరాబాద్, లక్నో మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

Also Read: Dhanush: కోటి విరాళం ప్రకటించిన ధనుష్‌.. కారణం ఏంటంటే?

ఆర్‌సీబీ వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే‌పై గెలవడం చాలా ముఖ్యం. సీఎస్‌కే‌ను ఆర్‌సీబీ 18 ప్లస్ రన్స్ తేడాతో ఓడించాలి. లేదా 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించాలి. అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్‌రేట్ సాధించి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అంతేకాదు హైదరాబాద్, లక్నో జట్లు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటైనా ఓడాలి. హైదరాబాద్, లక్నోలు చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడితే ఆర్‌సీబీతో పాటు సీఎస్‌కే కూడా ప్లేఆఫ్స్‌ చేరుతాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌ అవకాశాలు గల్లంతవుతాయి. 13 పాయింట్స్‌తో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

Show comments