Chennai Super Kings IPL 2024 Playoffs Top 2 Scenario: ఐపీఎల్ 2024 చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇక చివరి బెర్తును ఎవరు దక్కించుకుంటారా? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న చెన్నై చివరి బెర్త్ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బెంగళూరుకు ప్లేఆఫ్స్ చేరడానికి అవకాశాలున్నాయి. అయితే చెన్నైపై భారీ తేడాతో గెలిస్తే బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. 15 పాయింట్లతో చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
శనివారం జరగనున్న మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై గెలిస్తే.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు వెళుతుంది. చెన్నై రెండో స్థానాని చేరుకోవాలంటే.. బెంగళూరుపై తప్పక గెలవాలి. ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోవాలి. మరోవైపు రాజస్థాన్‌పై కోల్‌కతా విజయం సాధించాలి. ఇదే జరిగితే.. రాజస్థాన్ 16, హైదరాబాద్ 15 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు చెన్నై 16 పాయింట్లు సాధించి మెరుగైన నెట్ రన్‌రేట్‌తో సెకండ్ ప్లేస్‌కు వెళ్తుంది.
Also Read: Ujjain : క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో రూ.2 కోట్లు పోగొట్టుకుని… అప్పు తీర్చలేక ఆత్మహత్య
హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్,, చెన్నై, బెంగళూరు మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే.. హైదరాబాద్ 16 పాయింట్లు, చెన్నై 15 పాయింట్లతో లీగ్ దశను ముగిస్తాయి. అప్పుడు బెంగళూరు ఇంటి ముఖం పడుతుంది. కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై ప్లేఆఫ్స్‌లో ఆడుతాయి.