NTV Telugu Site icon

KKR vs SRH Final: కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ మ్యాచ్.. తుది జట్లు ఇవే!

Kkr Vs Srh Playing 11

Kkr Vs Srh Playing 11

IPL 2024 Final, KKR vs SRH Playing 11: ఐపీఎల్ 2024 ఫైనల్ సమరానికి వేళైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2024 పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11ను ఓసారి పరిశీలిద్దాం.

కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూరమైనా ఆ లోటు లేకుండా.. రహ్మానుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ ఫామ్ మీదున్న విషయం తెలిసిందే. వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ మరోసారి చెలరేగితే పరుగుల వరద పారుతుంది. రింకు సింగ్, ఆండ్రి రస్సెల్ బ్యాట్ జులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాతిక కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ (3/34) కీలక సమయంలో ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి సునీల్ నరైన్, వరుణ్‌ చక్రవర్తిలు మాయ చేయనున్నారు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు.

హైదరాబాద్‌ జట్టుకు గత కొన్ని మ్యాచుల్లో ఓపెనింగ్‌ ఇబ్బందిగా మారింది. దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్‌ శర్మలో త్వరగా పెవిలియన్‌కు చేరుతున్నారు. ముఖ్యంగా అభిషేక్‌ క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. క్వాలిఫయర్‌ 2లో హెడ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ రాణించారు. వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. నితీశ్‌ రెడ్డి, అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ భాకీ ఉన్నారు. షాబాజ్ అహ్మద్ కూడా ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. పాట్ కమిన్స్ , భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. అవసరం అనుకుంటే హెడ్, అభిషేక్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.

Also Read: MS Dhoni: సెక్యూరిటీ లేకుండా వచ్చి.. ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఎస్ ధోనీ!

తుది జట్లు (అంచనా):
కోల్‌కతా: రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రి రస్సెల్, రమణ్‌దీప్‌ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్‌ చక్రవర్తి.
హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియస్కాంత్, టీ నటరాజన్.

Show comments