NTV Telugu Site icon

IPL 2021 : సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. SRH విధించిన 116 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలో మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇక KKR బ్యాట్స్‌మెన్లలో శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. నితిష్‌ రానా 25 , దినేశ్‌ కార్తీక్‌ 18 పరుగులు చేశాడు. SRH బౌలర్లలో హోల్డర్‌ 2 వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌, సిద్దార్థ్‌ కౌల్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఇక అటు నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌.

పంజాబ్‌పై 6 పరుగులతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌.. 7 వికెట్ల నష్టానికి 164 రన్స్‌ చేసింది. దూకుడుగా ఆడిన మాక్స్‌వెల్‌.. 57 రన్స్‌ చేశాడు. పడిక్కల్‌ 40, కోహ్లి 25 పరుగులు చేశారు. ఛేజింగ్‌లో పంజాబ్‌కు శుభారంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు KL రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌. వీరిద్దరూ తొలివికెట్‌కు 91 రన్స్‌ చేశారు. ఓపెనర్లు అవుటయ్యాక.. మిగిలిన పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ ఫెయిలయ్యారు. దీంతో పంజాబ్‌ 20 ఓవర్లలో.. 6 వికెట్లు కోల్పోయి 158 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. చాహల్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విక్టరీతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది కోహ్లీసేన.