NTV Telugu Site icon

MS Dhoni: సీఎస్కే కొత్త కెప్టెన్పై ఎంఎస్ ధోని స్టన్నింగ్ కామెంట్స్..

Dhoni

Dhoni

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వైదొలిగిన తర్వాత తొలి సారిగా మహేంద్ర సింగ్ ధోని స్పందించారు. తనకు మజిల్ పవర్ తక్కువని.. ఫీల్డింగ్ లో జరిగిన తప్పుల గురించి త్వరగా స్పందించలేనని చెప్పుకొచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కివీస్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర.. గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్యాచ్ వదిలేశాడు.. దీనిపై ఎంఎస్ ధోని స్పందిస్తూ తాను కెప్టెన్ని కానని కాజ్యువల్ గా ఆన్సర్ ఇచ్చాడు.

Read Also: Uttarpradesh : గ్యాంగ్ రేప్ చేశారంటే పట్టించుకోని పోలీసులు.. స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు

ఇక, మరో వైపు ఎవరైనా ఫస్ట్ గేమ్ లేదా సెకండ్ గేమ్ ఆడుతున్నప్పుడు తాను ఎక్కువగా స్పందించనని ధోని చెప్పుకొచ్చాడు. కానీ, రచిన్ రవింద్ర ఫీల్డ్ మొత్తం తిరుగుతూ చూడటం చాలా సరదాగా ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భగా సీఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ని ఎంఎస్ ధోని ప్రశంసలతో ముంచెత్తాడు. గైక్వాడ్ కూడా ఫీల్డర్లు తప్పు చేస్తే పెద్దగా రియాక్ట్ కాదు అని తెలిపాడు. ఇక, రచిన్ రవీంద్రను మీరు క్యాచ్ మిస్ చేసినప్పుడు, మీరు ఎంఎస్ ధోని వైపు చూశారా? అతను ఎలా స్పందించాడు? అతను మీకు ఏం చెప్పాడు? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కొత్త కెప్టెన్ ఉన్నాడు అని రచిన్ ఆన్సర్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

Show comments