Site icon NTV Telugu

IPL 2022 : ఉత్కంఠ నడుమ గుజరాత్‌ విజయం

Gujrath Titans

Gujrath Titans

నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య శుక్రవారం ఆసక్తికర పోరు జరిగింది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి గుజరాత్‌ ముందు భారీ స్కోర్‌ నిలిపింది. అనంతరం బరిలో దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ లక్ష్యచేధన ఉత్కంఠ రేపింది. 190 పరుగుల ఛేజింగ్‌లో గుజరాత్ జట్టును ముందుండి నడిపించిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (96) సెంచరీ చేయకుండానే వెనుతిరిగాడు. అయితే ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో రాహుల్‌ తెవాటియా రెండు సిక్స్‌లు కొట్టి జట్టును గెలిపించాడు. గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది.

Exit mobile version