NTV Telugu Site icon

LSG vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ.. స్టార్ ప్లేయర్ దూరం

Lsg Vs Dc

Lsg Vs Dc

ఐపీఎల్ 2025లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ విశాఖలోని ACA–VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రాత్రి 7.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కాగా.. ఢిల్లీ జట్టులో కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో మొదటి మ్యాచ్ ఆడటం లేదు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. లక్నో జట్టుకు రిషబ్ పంత్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అందరి చూపు రిషబ్ పంత్ పైనే ఉంటుంది. ఈ సీజన్‌లో పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.

Read Also: JR NTR : జపాన్ లో దేవర హంగామా.. ఆ సాంగ్ కు ఎన్టీఆర్ డ్యాన్స్..

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్:
ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్:
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.