Mitchell Marsh ruled out of IPL 2024: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మిగతా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. చీలమండ నొప్పికి చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్లిన మార్ష్.. తిరిగి భారత్‌కు రావడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ధ్రువీకరించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయాడు.
తన గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వైద్య సిబ్బందిని సంప్రదించడానికి ఏప్రిల్ 12న మిచెల్ మార్ష్ పెర్త్‌కు వెళ్లాడు. మార్ష్ గాయాన్ని అంచనా వేసిన సీఏ వైద్య బృందం.. ఐపీఎల్ ఆడకుండా ఆస్ట్రేలియాలోనే ఉండాలని సూచించింది. టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడుతుండడంతో అతడిని భారత్‌కు పంపించి రిస్క్ చేయకూడదని సీఏ బావించింది. దాంతో మార్ష్ ఐపీఎల్ 2024లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
Also Read: Yuzvendra Chahal-IPL: ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా చహల్ అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2024లో మిచెల్ మార్ష్ విఫలమయ్యాడు. 4 మ్యాచ్‌లలో 61 రన్స్ మాత్రమే చేశాడు. రాజస్తాన్‌పై అత్యధికంగా 23 పరుగులు చేశాడు. ఏప్రిల్ 3న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చివరిగా మార్ష్ ఆడాడు. ఆపై ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న మార్ష్.. టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది.