సన్ రైజర్స్ ప్లేఆప్స్ అవకాశాలకు గండి పడింది. వరుణుడి ప్రభావం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో ఫ్యాట్ కమిన్స్ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. బ్యాటర్లు ఆధిపత్యం చూపించే పవర్ ప్లేలో కమిన్స్ మూడు కీలక వికెట్లు నేలకూల్చాడు. ఇక్కడే ఢిల్లీ పతనానికి పునాదులు పడ్డాయి. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో ఢిల్లీ 133 పరుగులకే పరిమితమైంది. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత గంట పాటు వర్షం కురవడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. పిచ్ ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే ఆ ఆఫెక్ట్ SRH ప్లేఆఫ్ అవకాశాలపై పడింది. ఫలితంగా హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Also Read : Civil Mock Drill : రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే..
మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి ఉప్పల్ పిచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంతో పోల్చుకుంటే పిచ్ లు బ్యాటర్లకు అనుకూలంగా లేవన్నాడు. గత సీజన్లో భారీ స్కోర్ చేసిన ఆటగాళ్లు ఈ సీజన్లో అంచనాలను అందుకోలేకపోవడానికి కారణం పిచ్ లేనని స్పష్టం చేశాడు. ఊహించిన దానికంటే పిచ్ లు భిన్నంగా ఉన్నాయన్న వెటోరి.. ఉప్పల్ లో ఆరు పిచ్‌లలో రెండు పిచ్‌లు భారీ స్కోరుకు అనుకూలిస్తుండగా.. మిగతా నాలుగు పేసర్లకు అనుకూలించాయని చెప్పాడు. స్పిన్ కు ఆ పిచ్ లు ఏ మాత్రం సహకరించలేదని అన్నాడు.
Also Read : VarunTej : మెగా ఆనంద హేల.. తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్
