NTV Telugu Site icon

CSK vs SRH: చ‌రిత్ర సృష్టించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ప్రపంచంలోనే తొలి జట్టు!

Chennai Super Kings

Chennai Super Kings

Chennai Super Kings Create History in T20 Cricket: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) అరుదైన ఘనత సాధించింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా సీఎస్‌కే రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగులు చేయడంతో సీఎస్‌కే ఖాతాలో ఈ అరుదైన ఫీట్‌ చేరింది. టీ20ల్లో చెన్నై జట్టు ఇప్పటివరకు 35 సార్లు 200లకు పైగా పరుగులు చేసింది.

Also Read: Jammu : నదిలో పడ్డ కారు.. నలుగురు మృతి… ముగ్గురు సేఫ్

ఇంతకుముందు టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా ఇంగ్లండ్‌ కౌంటీ టీమ్ సోమర్‌సెట్‌ ఉంది. సోమర్‌సెట్‌ టీ20ల్లో 34 సార్లు 200 ప్లస్‌ స్కోర్ సాధించింది. తాజాగా సోమర్‌సెట్‌ రికార్డును చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్రేక్‌ చేసింది. ఈ జాబితాలో టీమిండియా మూడో స్థానంలో ఉంది. భారత జట్టు 32 సార్లు 200పైగా పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 31 సార్లు 200 ప్లస్ స్కోర్‌లను చేసింది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా (32) ఉంది.