Site icon NTV Telugu

CSK vs RR: రాజస్థాన్‌పై విజయం.. చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!

Chennai Super Kings

Chennai Super Kings

Chennai Super Kings in IPL 2024 Playoffs Race: ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి 145 రన్స్ చేసి ఛేదించింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (42 నాటౌట్; 41 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రచిన్ రవీంద్ర (27), డారిల్ మిచెల్ (22) పరుగులు చేశారు. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. మరో మ్యాచ్‌లో గెలిస్తే.. చెన్నై ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.

రాజస్థాన్ నిర్దేశించిన స్వ‌ల్ప ఛేద‌న‌లో చెన్నై ఆదిలోనే తడబడింది. అశ్విన్ బౌలింగ్‌లో ఓపెనర్ ర‌చిన్ ర‌వీంద్ర‌ అవుట్ అయ్యాక.. డారిల్ మిచెల్ అటాకింగ్ గేమ్ ఆడాడు. అయితే యుజ్వేంద్ర చహ‌ల్ అత‌డిని ఎల్బీగా ఔట్ చేశాడు. మోయిన్ అలీ (10) నిరాశపర్చగా.. శివం దూబే (18) ధాటిగా ఆడాడు. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంట‌రి పోరాటం చేశాడు.

Also Read: Orry Income: హీరోయిన్స్‌ను ముట్టుకుంటున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు!

మ్యాచ్ ముగిస్తాడనుకున్న ర‌వీంద్ర జ‌డేజా (5) అనూహ్యంగా పెవిలియన్ చేరాడు. ర‌నౌట్ త‌ప్పించుకునేందుకు వికెట్ల‌కు అడ్డంగా ప‌రుగెత్తి ఔట‌య్యాడు. దాంతో అభిమానుల్లో ఉత్కంఠ‌ నెలకొంది. అయితే ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ స‌మీర్ రిజ్వీ (15 నాటౌట్) బాగా ఆడాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 19వ ఓవ‌ర్లో రిజ్వీ వ‌రుస‌గా రెండు బౌండ‌రీలు బాద‌డంతో.. చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని పోరులో చెన్నై పంజా విసిరింది. పట్టికలో చెన్నై మూడో స్థానానికి దూసుకొచ్చింది. మ్యాచ్ ఓడిపోవడంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ అధికార ప్లే ఆఫ్స్ బెర్త్ డాకించుకోలేకపోయింది.

Exit mobile version