NTV Telugu Site icon

CSK vs MI: రోహిత్ సెంచరీ.. ముంబైకు తప్పని ఓటమి

Csk Won

Csk Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపొందింది. 20 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినప్పటికీ.. వృధా అయిపోయింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ (105*)పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి.

MP K.Laxman : ఈ పది సంవత్సరాల్లో దళారీ వ్యవస్థ లేకుండా చేశాం

ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ (23) మంచి శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. డకౌట్ తో వెనుదిరిగాడు. తిలక్ వర్మ (31) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. హార్ధిక్ పాండ్యా (2), టిమ్ డేవిడ్ (13), నబీ (4) పరుగులు చేశారు. చెన్నై బౌలింగ్ లో పతిరనా 4 వికెట్లతో చెలరేగాడు. కీలకమైన వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ కు తలో వికెట్ దక్కింది.

Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన ఆనంద్ మహీంద్రా.. ట్వీట్ వైరల్..!

అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 206 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (66), శివం దూబే (66*) పరుగులతో దుమ్ము దులిపారు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. దూబే ఇన్నింగ్స్ లో 2 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సీఎస్కే భారీ స్కోరు చేసింది. సీఎస్కే బ్యాటింగ్ లో రహానే (5), రచిన్ రవీంద్ర (21), డారిల్ మిచెల్ (17), ఎంఎస్ ధోని (20) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్ లో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. కోయెట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

Show comments