Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్‌కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా

  • రుతురాజ్‌కు మరో షాక్
  • బీసీసీఐ భారీ జరిమానా
  • గైక్వాడ్‌కు రూ. 24 లక్షల జరిమానా
Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

గురువారం రాత్రి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో తొమ్మిదో విజయాన్ని అందుకున్న జీటీ, సీఎస్‌కేను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్‌కు మరో షాక్ ఇచ్చింది బీసీసీఐ.

నెమ్మదిగా ఓవర్లు వేసినందుకు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బీసీసీఐ నుండి మరో శిక్షను ఎదుర్కొన్నాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఓవర్-రేట్ నిబంధనలను ఉల్లంఘించడం ఇది రెండోసారి. ఫలితంగా, గైక్వాడ్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించగా, ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మతో సహా మిగిలిన జట్టు సభ్యులకు రూ. 6 లక్షలు లేదా వారి వారి మ్యాచ్ ఫీజులలో 25 శాతం, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు.

మొదటి ఉల్లంఘన.. ఏప్రిల్ 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే స్లో ఓవర్ రేట్ నిర్వహించడంతో రుతురాజ్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించారు.
రెండవ ఉల్లంఘన: సీజన్ ముగిసేలోపు మరో మ్యాచ్‌లో మళ్లీ స్లో ఓవర్ రేట్ సమస్య రావడంతో బీసీసీఐ రూ.24 లక్షలు జరిమానా వేసింది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 కింద ఈ జరిమానాలు విధించింది. రెండవ ఉల్లంఘనకు డబుల్ జరిమానా (రూ.24 లక్షలు) నిబంధన ఉంది. మూడవసారి జరిగితే జరిమానా మరింత పెరిగి డీమెరిట్ పాయింట్లు, సస్పెన్షన్ వంటి శిక్షలు వచ్చే అవకాశం ఉంది.

బీసీసీఐ నిబంధనలు ఏమిటి?

1వ ఉల్లంఘన: రూ.12 లక్షలు
2వ ఉల్లంఘన: రూ.24 లక్షలు
3వ ఉల్లంఘన: రూ.30 లక్షలు + డీమెరిట్ పాయింట్లు
రూ.25 లక్షలు దాటితే ఆటోమేటిక్ డీమెరిట్ పాయింట్

సీఎస్‌కే ఈ సీజన్‌లో నిరాశపరిచింది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయింది. కొన్ని మ్యాచ్‌లలో బ్యాటింగ్ స్లోనెస్, ఫీల్డింగ్ లోపాలు, స్లో ఓవర్ రేట్ సమస్యలు జట్టును బలహీనపరిచాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఇటీవలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా ముగిశాయి. రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ, “మేము తదుపరి సీజన్‌లో మరింత బలమైన జట్టుగా తిరిగి వస్తాం” అని చెప్పాడు. అయినప్పటికీ, కెప్టెన్‌గా అతని స్ట్రాటజీ, జట్టు డైసిప్లిన్‌పై విమర్శలు వచ్చాయి.