Site icon NTV Telugu

Akash Madhwal: చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ఒకే దెబ్బకు నాలుగు రికార్డులు

Akash Madhwal Records

Akash Madhwal Records

Akash Madhwal Creates 4 Records With His Great Spell: బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్ ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడో అందరికీ తెలుసు. 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రేరక్ మన్కడ్, ఆయుశ్ బదోని, నికోలస్ పూరన్ వంటి డేంజరస్ బ్యాటర్లతో పాటు రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్‌లను పెవిలియన్ బాట పట్టించాడు. దీపక్ హుడాని రనౌట్ చేయడం మరో జాక్‌పాట్. ఒక విధంగా చెప్పాలంటే.. అతడు లక్నో పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే ఆకాశ్ ఏకంగా నాలుగు రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు అంకిత్‌ రాజ్‌పుత్‌ (5/14, పంజాబ్‌ 2018), వరుణ్‌ చక్రవర్తి (5/20, కేకేఆర్‌ 2020), ఉమ్రాన్‌ మాలిక్‌ (5/25, సన్‌రైజర్స్‌ 2022) ఈ ఫీట్ సాధించగా.. తాజాగా ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5) వాళ్లందరిని వెనక్కు నెట్టి, అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి చరిత్ర సృష్టించారు.

Amit Shah: మోడీ మూడోసారి ప్రధాని అవుతారు.. 300 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం.

ఇక రెండోది.. ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లోనే అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేసిన బౌలర్ ఆకాశ్ నిలిచాడు. అంతకుముందు ధవల్‌ కులకర్ణి (4/14), జస్ప్రీత్‌ బుమ్రా (4/14), డౌగ్‌ బొలింగర్‌ (4/13) బెస్ట్ ఫిగర్స్ నమోదు చేస్తే.. ఇప్పుడు ఆకాశ్ (5/5)తో సత్తా చాటాడు. మూడోది.. ఐపీఎల్‌లో అతి తక్కువ ఎకానమీతో 5 వికెట్లు సాధించిన ప్లేయర్‌గా ఆకాశ్ రికార్డ్ నెలకొల్పాడు. తొలుత అనిల్‌ కుంబ్లే 2009లో 1.57 ఎకానమీతో (5/5) వికెట్లు తీసి అప్పట్లో హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అనంతరం జస్ప్రీత్‌ బుమ్రా 2002లో 2.50 ఎకానమీతో (5/10) వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆ ఇద్దరిని వెనక్కు నెట్టి.. ఆకాశ్‌ మధ్వాల్‌ 1.4 ఎకానమీతో (5/5) అత్యుత్తమ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. నాల్గవది.. ఓవరాల్ ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లలో ఐదో స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో అల్జరీ జోసఫ్‌ (6/12), సోహైల్‌ తన్వీర్‌ (6/14), ఆడమ్‌ జంపా (6/19), అనిల్‌ కుంబ్లే (5/5) ఉన్నారు. ఈ లెజెండ్స్ సరసన ఆకాశ్‌ మధ్వాల్‌ (5/5) ఐదో స్థానంలో నిలిచాడు.

Hyderabad Crime: హైదరాబాద్‌లో విషాదం.. భర్త మరణాన్ని భరించలేక..

Exit mobile version