DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!

Dc Vs Kkr

Dc Vs Kkr

DC vs KKR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈ రోజు (మే 8) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ 51వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. నిజానికి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో ఇటు ఢిల్లీకి, అటు కోల్‌కతాకు గెలుపు అత్యంత కీలకం. ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటంతో, ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.

ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ, 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టికలో వెనుకబడి ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో 7 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే కోల్‌కతాదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మొత్తం మ్యాచ్‌లు 35 అయితే అందులో కోల్‌కతా 19 విజయం సాధించగా, ఢిల్లీ 15 గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలలేదు. గత సీజన్‌లో జరిగిన పోరులో కూడా కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది.

ఢిల్లీ క్యాపిటల్స్: పథుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగీ ఎన్గిడి, ముఖేష్ కుమార్.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అక్షర్ సేన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అటు స్టార్క్ బౌలింగ్, ఇటు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఢిల్లీకి కీలకం కానున్నాయి. కేకేఆర్ తరపున సునీల్ నరైన్, రింకూ సింగ్ ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో చూడాలి.