Site icon NTV Telugu

IPL 2026 Auction: ఐపీఎల్‌ వేలంలో 39 ఏళ్ల స్పిన్నర్.. గతంలో పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు!

Ipl 2026 Mini Auction

Ipl 2026 Mini Auction

Youngest and Oldest Player IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం ఆటగాళ్ల మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. వేలం జాబితాలో మొత్తం 350 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే గరిష్టంగా 77 మంది ఆటగాళ్లని 10 ప్రాంఛైజీలు కొనుగోలుకు చేయనున్నాయి. 77 మందిలో 31 మంది విదేశీ ఆటగాళ్లకు స్లాట్ ఉంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన 350 మంది ఆటగాళ్లలో 240 మంది భారతీయులు, 110 మంది విదేశీయులు ఉన్నారు. మినీ వేలం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది 19వ వేలం. ఐపీఎల్ వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

వహీదుల్లా జాద్రాన్:
వేలంలో అఫ్గానిస్తాన్‌కు చెందిన వహీదుల్లా జాద్రాన్ అతి పిన్న వయస్కుడు. రేపటికి జద్రాన్ వయస్సు 18 సంవత్సరాల 31 రోజులు. ఆఫ్-స్పిన్ బౌలర్ అయిన అతడు ప్రస్తుతం అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టు తరపున ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ అండర్-19తో జరిగిన సిరీస్‌లో జద్రాన్ నాలుగు ఇన్నింగ్స్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. ష్పగీజా క్రికెట్ లీగ్ 2025లో మూడు ఇన్నింగ్స్‌లలో ఆరు వికెట్లు పడగొట్టి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. జద్రాన్ 19 టీ0 మ్యాచ్‌లలో 6.72 ఎకానమీ రేటుతో 28 వికెట్లు పడగొట్టాడు. మినీ వేలంలో జద్రాన్ బేస్ ధర రూ.30 లక్షలు.

Also Read: MG Hector Facelift Launch: సరికొత్త డిజైన్‌, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ADAS భద్రత.. రూ.2 లక్షల తక్కువ ధరకు కొత్త హెక్టర్ లాంచ్!

జలజ్ సక్సేనా:
మహారాష్ట్ర ఆల్‌రౌండర్‌ జలజ్ సక్సేనా మినీ వేలంలో అత్యంత పెద్దవయస్కుడు. వేలం రోజున జలజ్ వయసు 39 సంవత్సరాల ఒక రోజు. ఈరోజు (డిసెంబర్ 15) సక్సేనాకు 39 ఏళ్లు నిండాయి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరపున సక్సేనా ఒక మ్యాచ్ ఆడాడు. దేశీయ క్రికెట్లో నిలకడగా ఆడినప్పటికీ భారత జట్టుకు ఎంపిక కాలేదు. సక్సేనా 155 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 7,202 పరుగులు చేసి 496 వికెట్లు పడగొట్టాడు. అతను 109 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 2,056 పరుగులు, 123 వికెట్లు కూడా తీసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 709 పరుగులు, 86 వికెట్లు పడగొట్టాడు. మినీ వేలంలో సక్సేనా బేస్ ధర రూ.40 లక్షలు. పిన్న వయస్కుడు వహీదుల్లా జాద్రాన్, పెద్ద వయస్కుడు జలజ్ సక్సేనాను ఏ ప్రాంచైజీ తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version