సీఎస్కే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో అద్భుత ప్రదర్శన చేసి.. ఫైనల్ లో చోటు దక్కించుకుంది. తొలి క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ సీఎస్కేతో పైనల్ పోరులో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కు చెన్నై టీమ్ అన్ని వ్యూహాలతో సిద్ధం ఉంది. దాదాపు ప్రతి బిగ్ మ్యాచ్ లో ప్రమాదకరంగా బౌలింగ్ చేసే బౌలర్ కు మరింత ఎక్కువగా పదును పెడుతుంది. ఫైనల్లోనూ మరోసారి ఆ బాణాన్ని విసిరి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని ధోని కోరుకుంటున్నాడు. అతను ఎవరో కాదు.. దీపక్ చాహర్.
Also Read : Nama Nageswara Rao: అనుభవంతో చెబుతున్నా.. మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తారు
సీఎస్కే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఎన్నో సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్ లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్లే ఆఫ్స్ లో దీపక్ చాహర్ కు ఘనమైన రికార్డ్ ఉంది. ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడిన చాహర్ 12 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఈ సీజన్ తొలి క్వాలిఫయర్ లో దీపక్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు.. 2021 చివరి మ్యాచ్ లో అతను 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
Also Read : Amaravathi: 50 వేల మంది పేదలకు గుడ్‌న్యూస్.. నేడే ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ
2019 ప్లేఆఫ్స్ మ్యాచ్ ల్లోనూ దీపక్ చాహర్ ప్రమాదకరంగా బౌలింగ్ చేశాడు. తొలి క్వాలిఫయర్ లో ఒక వికెట్.. రెండో క్వాలిఫయర్ లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక.. 2018లో ఫ్లే ఆఫ్స్ మ్యాచ్ ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టును దీపక్ చాహర్ పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. ఈ సీజన్ లో రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్ కు చేరుకుంటుంది.
