Site icon NTV Telugu

IPL 2022 : ఎక్కువ ధర పలికన ఆటగాళ్లు వీళ్లే !

నిన్నటి రోజున ఐపీఎల్‌ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వేలంలో ఎవరు.. ఏ ధరకు కొనుగోలు అయ్యారో తెలుసుకుందాం. ఐపీఎల్‌లో అత్యధిక ఐదుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్‌. ఈసారి సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్‌ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్‌ కిషన్‌తోపాటు ఫిట్‌నెస్‌ సాధిస్తే హార్దిక్‌ పాండ్యను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నలుగురి కోసం 42 కోట్లను కేటాయించింది.

రోహిత్‌కు 16 కోట్లు, బుమ్రా 12, సూర్యకుమార్‌ యాదవ్‌ 8 కోట్లు, పొలార్డ్‌ 6 కోట్లకుతో రిటెయిన్‌ చేసుకుంది. నాలుగు సార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ధోనీకి విడదీయరాని బంధం ఉంది. ఈసారి కూడా సీఎస్‌కే ధోనీని రిటెయిన్‌ చేసుకుంది. ధోనీతో పాటు రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీను అట్టపెట్టుకుంది. ధోనీ కోసం 12 కోట్లు కేటాయించిన సీఎస్‌కే.. జడేజాకు 16 కోట్లు, మొయిన్‌ అలీకి 8 కోట్లు, రుతురాజ్‌ గైక్వాడ్‌కు 6 కోట్లు కేటాయించింది.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌…సునీల్‌ నరైన్ 6 కోట్లు, ఆండ్రూ రస్సెల్‌ 12 కోట్లు, వెంకటేశ్‌ అయ్యర్‌ 8 కోట్లు, వరుణ్ చక్రవర్తి 8 కోట్లతో రిటెయిన్‌ చేసుకుంది. శుభ్‌మన్ గిల్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపొచ్చు. నలుగురు ఆటగాళ్ల కోసం 34 కోట్లు కేటాయించింది. కెప్టెన్‌ ఇయన్‌ మోర్గాన్‌ను వదిలేసింది. ఢిల్లీ కేపిటల్స్‌… కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ 16 కోట్లు, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్ 9 కోట్లు, ఓపెనర్‌ పృథ్వీ షా 7.5 కోట్లు, పేస్‌ బౌలర్‌ ఎన్రిచ్‌ నార్జ్‌ 6.5 కోట్లు పెట్టి తమ వద్దే ఉంచుకుంది. ఆర్‌సీబీ… కోహ్లీ 15 కోట్లు, మ్యాక్స్‌వెల్‌ 11 కోట్లు, మహమ్మద్‌ సిరాజ్‌ 7 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. ముగ్గురు ప్లేయర్ల కోసం 33 కోట్లను ఖర్చు చేసింది. మిగతా జట్టు కోసం 57 కోట్లను కేటాయించనుంది. పంజాబ్‌ కింగ్స్‌ మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ను అట్టిపెట్టుకుంది. మయాంక్‌కు 12 కోట్లు, అర్ష్‌దీప్‌కు 4 కోట్లతో రిటెయిన్‌ చేసుకుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు 14 కోట్లు, అబ్దుల్‌ సమద్‌ 4 కోట్లు, ఉమ్రాన్‌ మాలిక్‌ 4 కోట్లు పెట్టింది. ముగ్గురు ఆటగాళ్ల కోసం 22 కోట్లు ఖర్చు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు…కెప్టెన్‌ సంజూ శాంసన్‌ 14 కోట్లు, బట్లర్‌ 10 కోట్లు, జైశ్వాల్‌ 4 కోట్లకు రిటైన్‌ చేసుకుంది.

Exit mobile version