Site icon NTV Telugu

ఐపీఎల్‌ -14 : మరికాసేపట్లోనే చెన్నై, ముంబై మ్యాచ్‌

కరోనా ప్రభావంతో ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్‌ ఇవాల్టి నుంచి పునః ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో దుబాయ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ లీగ్ మొదలుకానుంది. భారత్‌లో జరిగిన మొదటి దశలో 29 మ్యాచులు జరిగాయి. ఇంకా 31 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతోపాటు ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిరవధికంగా వాయిదా వేశారు. అప్పటి నుంచి బీసీసీఐ చేసిన ప్రయత్నాలు ఫలించి, యూఏఈలో నేటి నుంచి మరోసారి మ్యాచ్ లు జరగనున్నాయి.

Exit mobile version