NTV Telugu Site icon

పారాలింపిక్స్ : భారత్ కు మొదటి స్వర్ణం

Avani-Lekhara

Avani-Lekhara

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. నిన్న ఒక్క రోజే రెండు సిల్వర్, ఒక్క బ్రోన్జ్ కలిపి మొత్తం మూడు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈరోజును స్వర్ణంతో ప్రారంభించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ గెలిచింది ‘అవని లేఖరా’. దాంతో పారాలింపిక్స్ లో ద్వారణం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. లేఖరా ఫైనల్‌లో మొత్తం 249.6 స్కోరు సాధించింది. ఈ స్కోర్ తో ప్రపంచ రికార్డును సమం చేసింది. 2018 డిసెంబర్ లో ఉక్రెయిన్‌కు చెందిన ఇరినా షెత్నిక్ ఇదే స్కోర్ తో ప్రపంచ రికార్డును నమోదు చేయగా ఇప్పుడు దానిని సమం చేసిన భారత షూటర్ అవని లేఖరా.

Show comments