ఫిబ్రవరి 4 నుంచి చైనాలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేస్తూ క్రీడలను నిర్వహిస్తున్నారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వివధ దేశాల నుంచి క్రీడాకారులు వచ్చిన సంగతి తెలిసిందే. క్రీడలు జరిగే స్డేడియంలో ప్రేక్షకులు ఎవర్నీ అనుమతించడం లేదు. అంతేకాదు, క్రీడాకారులు నివశించే ప్రాంతాల్లోకి కూడా ఎవర్నీ అనుతించడం లేదు. క్రీడాకారులకు కావాల్సిన బట్టలు, ఇతర వస్తువులు, ఆహారం అన్నింటిని రోబోలే అందిస్తున్నాయి.
Read: వీడేం మనిషిరా బాబు… పాముల్ని అలా…
పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు శానిటేషన్ వంటివి రోబోలే చేస్తున్నాయి. ముందు నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ క్రీడాకారులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. దీంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని క్రీడలను నిర్వహిస్తున్నది చైనా ప్రభుత్వం. బీజింగ్ చుట్టుపక్కల ఉన్న నగరాల్లో ఇంకా లాక్‌డౌన్, ఆంక్షలు, నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి.